వైసీపీనే గెలుస్తుంది: బాబుకు గిడ్డి ఈశ్వరి ఝలక్, టిడిపిలో చేరికకు మరో ఆసక్తికర కారణం
టీడీపీలో చేరిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సోమవారం మీడియాతో మాట్లాడేటప్పుడు కొంత గందరగోళానికి గురైనట్లుగా వార్తలు వస్తున్నాయి. టీడీపీలో చేరిన ఆమె అనుకోకుండా..
అమరావతి: టీడీపీలో చేరిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సోమవారం మీడియాతో మాట్లాడేటప్పుడు కొంత గందరగోళానికి గురైనట్లుగా వార్తలు వస్తున్నాయి. టీడీపీలో చేరిన ఆమె అనుకోకుండా.. వైసీపీ గెలుస్తుందని వ్యాఖ్యానించారని తెలుస్తోంది.
Recommended Video


డ్యామ్ షూర్, వైసీపీ గెలుస్తుంది
ఇందుకు సంబంధించి వార్తలు వస్తున్నాయి. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 'డ్యామ్ షూర్ పాడేరు, అరకు నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుంది' అని వ్యాఖ్యానించారని తెలుస్తోంది. తనకు జగన్ రాజకీయ భిక్ష పెట్టినట్లు ఆమె చెప్పారు. కానీ అన్యాయం చేశారని చెప్పారు.

వైసీపీని వీడుతున్నందుకు బాధగా ఉంది
ఈశ్వరి ఇంకా మాట్లాడుతూ.. వైసీపీని వీడుతున్నందుకు బాధగా ఉందని, ఆత్మాభిమానం చంపుకొని టీడీపీలో చేరుతున్నానని చెప్పినట్లుగా సాక్షిలో కథనం వచ్చింది. వచ్చే ఎన్నికల్లో పాడేరు, అరకులలో వైసీపీనే గెలుస్తుందని వ్యాఖ్యానించడం గమనార్హం.

గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరడం వెనుక మరో కారణం
ఇదిలా ఉండగా, గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరడం వెనుక మరో కారణం ఉందనే ప్రచారం కూడా సాగుతోంది. ఆమె గతంలో చంద్రబాబు తల నరుకుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి ఆమె నియోజకవర్గానికి నిధులు ఆగిపోయాయని అంటున్నారు.

నియోజకవర్గ అభివృద్ధి క్రెడిట్ టీడీపీకి
ఇటీవల మంత్రి నారా లోకేష్ కారణంగా ఆ నియోజకవర్గానికి రూ.60 కోట్ల నిధులు విడుదలయ్యాయని, ఇప్పుడు అభివృద్ధి జరిగితే అది టీడీపీ ఖాతాలో పడుతుందని ఈశ్వరి గుర్తించారని, ఈ కారణంగా అన్నింటిని బేరీజు వేసుకొని ఆమె టీడీపీలో చేరారని అంటున్నారు.
-
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications