ముఖంపై ముడతలు పోవాలంటే ఇలా చేస్తే చాలు..
మారుతున్న జీవనశైలివల్ల అనేకరకాల సమస్యలు తలెత్తుతున్నాయి. కొందరు ఇన్ ఫెక్షన్ల బారిన పడుతున్నారు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇబ్బందులకు గురవుతున్నారు. వీటిల్లో ముఖ్యంగా ముఖంపై ముడతలు రావడం, చిన్న వయసులోనే పెద్దవారిలా కనపడుతుండటంతో వీటిని తొలగించుకోవడానికి, ముఖాన్ని కాంతివంతం చేసుకోవడానికి అనేక రకాల మాత్రలు వాడుతున్నారు. కానీ మన ఇంట్లోనే ఉన్న ఒక అద్భుతమైన వస్తువు ఈ ముడతలను సులభంగా తొలగించడమే కాకుండా కాంతివంతం చేస్తుంది.
ముడతలను తొలగించుకోవడానికి మార్కెట్‌లో లభించే రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌ని స్త్రీ, పురుషులిద్దరూ ఉపయోగిస్తున్నారు. అయినా వీరికి ఎటువంటి ఫలితం దక్కడంలేదు. ఖర్చు తక్కువగా ఉండి ఫలితం ఎక్కువగా ఉండాలంటే ప్రతి ఒక్కరి వంటింట్లో ఉండే అల్లం ఉపయోగిస్తే చాలు. ఇది ముఖంపై ముడతలని తొలగిస్తుంది. ఎలా తొలగిస్తుందో తెలుసుకుందాం.

సాధారణంగా అల్లం మనకు వంటల్లో ఉపయోగపడుతుంది. ఆహారం రుచి రావడానికి దీన్ని వాడుతుంటారు. అంతేకాదు.. టీ తాగడానికి కూడా దీన్నే ఉపయోగిస్తారు. బెల్లంతో అల్లం టీ తాగడం సర్వసాధారణమైపోయింది. అల్లంలో ఉండే యాంటీ ఏజింగ్ లక్షణాలు ముడతలు, ఫైన్ లైన్స్ తగ్గిస్తాయి. అలాగే ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు చర్మానికి సంబంధించిన అన్ని సమస్యలను తొలగిస్తాయి. దీనివల్ల మన చర్మం సహజ సిద్ధమైన మైన కాంతిని పొందుతుంది. అల్లం ఫేస్ మాస్క్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
ఒక గిన్నె తీసుకొని అందులో 1 టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ అల్లం పొడి, 2 టీస్పూన్ తేనె కలపాలి. వీటిల్లో అవసరమైన మేరకు రోజ్ వాటర్ కలిపి మెత్తని పేస్టులా చేసుకోవాలి. దీన్ని ముఖంపై అప్లై చేసేముందు ముఖాన్ని శుభ్రంగా కడగాలి. 15 నిముషాలు అప్లై చేసి నెమ్మదిగా మర్దన చేసి కొద్దిసేపు వదిలేయాలి. అనంతరం ముఖాన్ని శుభ్రంగా కడగాలి. అంతే.. అద్భుతమైన మెరుపును చూస్తారు. వారానికి రెండురోజులు ఇలా చేయడంవల్ల ముడతలు తొలగిపోతాయి.












Click it and Unblock the Notifications