ప్రియుడి ఇంటి ముందు ప్రేయసి ఆత్మహత్యాయత్నం

Girl attempt suicide in front of lover's residence in Hyderabad
హైదరాబాద్: ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన హైదరాబాదులోని ముషిరాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి - దోమలగూడలోని ఎస్‌బీహెచ్ కాలనీలో నివాసముంటున్న శీల (23) స్థానికంగా ఉన్న కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఇదే ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్ సీఎ చదువుతున్నాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు.

పెళ్లి చేసుకోవాలని చంద్రశేఖర్‌పై ఇటీవల శీల ఒత్తిడి తెచ్చింది. మరికొంత సమయం కావాలని శేఖర్ దాటవేస్తూ వస్తున్నాడు. దీంతో శీల సోమవారం చంద్రశేఖర్ ఇంటికి వెళ్లింది. తనను పెళ్లి చేసుకోవాలని అతని కుటుంబసభ్యుల ముందే కోరింది. అందుకు చంద్రశేఖర్ అంగీకరించలేదు. ఈ విషయమై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. చంద్రశేఖర్ కుటుంబసభ్యులు శీలను బయటకు గెంటేశారు.

మనస్తాపం చెందిన శీల తనతో తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకుంది. మంటలు తాళలేక పరుగులు తీసింది. స్థానికులు దుప్పట్లు కప్పి మంటలను ఆర్పి వేసి 108లో ఆస్పత్రికి తరలించారు. ముషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చంద్రశేఖర్ పరారీలో ఉన్నాడు.

మ్యాన్‌హోల్‌లో పడి కార్మికుడి మృతి

విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు మ్యాన్‌హోల్‌లో పడి ఓ కార్మికుడు మృతి చెందిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే - వరంగల్ జిల్లా పోచంపల్లికి చెందిన ఎం.వెంకన్న కూకట్‌పల్లి జిహెచ్‌ఎమ్‌సిలో తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికుడిగా 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. కాగా కూకట్‌పల్లిలోని కేరళకాలనీలో డ్రైనేజీ సమస్య కోసం అధికారులు ఆదివారం వెంకన్నను పంపారు.

ఈ క్రమంలో డ్రైనేజీ మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేస్తుండగా వెంకన్న ప్రమాదవశాత్తు కాలుజారి దానిలో పడిపోయాడు. దీంతో కనిపించకుండా పోయిన వెంకన్నకోసం స్థానిక ప్రజలు పోలీసుల సహాయంతో సంఘటనా ప్రాంతానికి ప్రొక్లైనర్‌ను రప్పించి డ్రైనేజీ పైపులైన్‌ను పగలగొట్టించారు. బయటికి తీసే సమయానికే వెంకన్న మృతి చెంది ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+