నాగార్జున యూనివర్సిటీలో వరంగల్ విద్యార్ధిని మృతి: ర్యాగింగే కారణమా?

గుంటూరు: జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బీఆర్కే (బ్యాచ్‌లర్ ఆఫ్ ఆర్కిటెక్చర్) ప్రధమ సంవత్సరం చదువుతున్న రుషితేశ్విని అనే విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన యూనివర్సిటీలో కలకలం సృష్టించింది. క్యాంపస్ లోని ఇందిరా ప్రియదర్శిని హాస్టల్‌లో ఆమె మరో ఇద్దరు విద్యార్థినులతో కలసి ఉంటోంది.

కాగా మంగళవారం కళాశాలకు వెళ్లకుండా రూంలోనే ఉండిపోయిన రుషికేశ్వరి గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకుంది. మధ్యాహ్నం స్నేహితులు తిరిగి వచ్చి చూడగా ఆమె విగతజీవిగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. కొన్ని రోజులుగా సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ పేరిట పెట్టిన వేధింపులే ఆమె ఆత్మహత్యకు కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Girl Attempted Suicide in acharya nagarjuna university

మృతురాలిది వరంగల్ జిల్లా అని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆమె వద్ద లభించిన సూసైట్ నోట్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే యూనివర్సిటీలో విద్యార్ధిని మృతిపై పలు అనుమానాలకు తావిస్తోంది.

పాతాళగంగలో దూకి ప్రేమ జంట ఆత్మహత్య

శ్రీశైలంలోని పాతాళగంగలో ప్రేమ జంట దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన నగరంలో సంచలనం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+