ఫొటో: విషాదం, అనారోగ్యంతో యువతి ఆత్మహత్య
హైదరాబాద్: అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ యువతి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఉరేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన హైదరాబాదులోని నల్లకుంట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.
ఇన్‌స్పెక్టర్ జైపాల్ రెడ్డి అందించిన వివరాల ప్రకారం - కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌కు చెందిన జి. సరళ (28) డిగ్రీ వరకు చదువుకుని ఉద్యోగం కోసం నగరానికి వచ్చింది. అప్పటి నుంచి ఆమె న్యూనల్లకుంటలో బాయమ్మగల్లీలోని శోభాకృష్ణ రెసిడెన్సీలోని హాస్టల్‌లో ఉంటుంది. ఇటీవల ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది.

దీనికితోడు ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైంది. గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ నిర్వాహకులు సరళ ఉరి వేసుకున్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులకు అక్కడకు చేరుకని మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. ఆమె రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకన్నారు.












Click it and Unblock the Notifications