యువతిపై గ్యాంగ్ రేప్: భర్తను చంపి ప్రియుడితో పరార్

బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగు చూసింది. ఎల్బీ నగర్ నుంచి ఘట్కేసర్ వెళ్తున్న తనపై ఆటో డ్రైవర్‌తో పాటు ఐదుగురు ఐదుగురు అత్యాచారం చేశారని ఆమె ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దండగులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఇదిలావుంటే, కృష్ణా జిల్లా నందిగామ మండలం అడవిరావులపాడు గ్రామంలో ఓ యువతి తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి పారిపోయారు. అడవిరావులపాడు గ్రామానికి చెందిన మర్లపూడి ఆశీర్వాదం (30)కు చందర్లపాడు మండలం తుర్లపాడుకు చెందిన ప్రమీలతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వారికి మహేశ్వరి, సిరివల్లి అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.
ఆశీర్వాదం తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. ప్రమీల వేల్పుల వినోద్ అనే యువకుడితో వైవాహికేతర సంబంధం పెట్టుకుంది. వినోద్, ప్రమీల కలిసి సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆశీర్వాదం మర్మాంగాలు కోసి హత్య చేశారు. ఆ తర్వాత ఇరువురూ పారిపోయారు. ఈ హత్య విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సాక్ష్యాలు సేకరించే పనిలో పడ్డారు.












Click it and Unblock the Notifications