ఆటోలో ఎత్తుకెళ్లి అడవిలో అమ్మాయిపై గ్యాంగ్ రేప్ చేశారు

గుంటూరు‌: గుంటూరు జిల్లా దారుణమైన సంఘటన జరిగింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని సుందరయ్య కాలనీకి చెందిన యువతి(21)పై అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.

సీఐ శ్రీధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం - సోమవారం రాత్రి స్థానిక సుందరయ్య కాలనీకి చెందిన యువతిని రహీం, రషీద్‌, వెంకటేశ్వర్లు, వెంకటేశ్‌ బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని రాజుపాలెం మండలం దేవరంపాడు అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు.

Girl gang raped in Guntur district

రహీం, రషీద్‌లు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో రహీం, రషీద్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. యువతిపై అత్యాచారం చేసినట్లు ఇద్దరు నిందితులు అంగీకరించారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

యువతి స్థానికంగా ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తోంది. ఎప్పటిలాగే పని ముగించుకుని రాత్రి ఏడు గంటలకు ఇంటికి తిరిగి వస్తుండగా అడ్డగించి ఆమెను ఎత్తుకెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+