ప్రియుడిని చితగ్గొట్టి యువతిపై నలుగురు సామూహిక అత్యాచారం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో దారుణమైన సంఘటన జరిగింది. నెల్లూరు జిల్లాలోని టీపీ గూడూరు మండలం కాటేపల్లి బీచ్ వద్ద ప్రేమజంటపై దుండగులు దాడి చేశారు. యువకుడి చితకబాది యువతిపై నలుగురు సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటనపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కరెంట్ షాకుతో యువకుడి మృతి

ప్రకాశం జిల్లాలో శుక్రవారంనాడు విషాద సంఘటన చోటు చేసుకుంది. రాయవరం గ్రామంలో విద్యుత్తు షాక్ తగిలి షాలిన్ రాజు (5) ఆనే బాలుడు మరణించాడు. ఇంటిపైన ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు కరెంట్ తీగలు తగలడంతో రాజు అక్కడికక్కడే మరణించాడు.

Girl gang raped in Nellore district

వాహనం బోల్తా పడి మృతి

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లి వద్ద తుఫాను వాహనం అదుపుతప్పి బోల్తాడ పడింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ సంఘటనలో మేరీ (29) అనే మహిళ అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ట్రాక్టర్‌పై నుంచి పడి యువకుడి మృతి

శ్రీకాకుళం జిల్లా వంగర మండలం పలగాం వద్ద ట్రాక్టర్‌పై నుంచి జారిపడి శివ్వాపు అప్పడు (25) అనే యువకుడు మరణించాడు. ట్రాలీలో చెరకు కట్టలను ఎక్కించడానికి శివ్వం గ్రామం నుంచి పొలానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+