మహిళపై అత్యాచారం, హత్య: బిర్యానీ, కండోమ్స్..
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం బుడితి జంక్షన్ సమీపంలో వంశధార కాలువ సమీపంలో వివాహితపై గుర్తు తెలియని వ్యక్తులు సామూహికంగా అత్యాచారం జరిపి అనంతరం హత్య చేశారు. జలుమూరు మండలం కామినాయుడుపేట గ్రామానికి చెందిన 32 ఏళ్ల ఓ మహిళ భర్త నుండి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది.
శనివారం ఉదయం బుడితి జంక్షన్ వద్ద కాలువ సమీపంలో ఆమె మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా మద్యం సీసాలు, బిరియానీ ప్యాకెట్లు, కండోమ్స్ కనిపించాయి. గుర్తు తెలియని దుండగులు ఆమెపై అత్యాచారం చేసి, తరువాత గొంతు నులిమి హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ దారుణం శుక్రవారం రాత్రి జరిగిందని పోలీసులు తెలిపారు.

కాగా, ఓ వికలాంగ మహిళా ఉద్యోగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. తోటి ఉద్యోగుల వేధింపులు భరించలేక ఆమె ఉసురు తీసుకోవడానికి ప్రయత్నించింది. అనసూయ అనే ఆ మహిళ చిత్తూరు ట్రెజరీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తోంది. తోటి ఉద్యోగులు వేధించడంప వల్లనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె ఓ సూసైడ్ నోట్ రాసి నిద్రమాత్రలు మింగింది.












Click it and Unblock the Notifications