విశాఖలో కార్లలో తిప్పుతూ గ్యాంగ్ రేప్, ఫోన్ చేసి: నిందితుల అరెస్టు
విశాఖ: విశాఖలో యువతి పైన అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిని, అతనికి సహకరించిన మరో మిత్రులను పోలీసులు శనివారం నాడు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. శనివారం సాయంత్రం డీసీపీ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
విజయవాడకు చెందిన బాధిత యువతి తన స్నేహితుడు శ్రీనివాస్ సోదరి వివాహానికి హాజరయ్యేందుకు ఈ నెల 4వ తేదీన విశాఖ శివారు పెందుర్తి వచ్చారు. ఆమె హైదరాబాదు నుండి వచ్చారు. నాలుగో తేదీన పెళ్లైంది. తర్వాత రోజు ఆమెకు విశాఖను చూపించేందుకు ఆమె స్నేహితుడు శ్రీనివాస్... తన స్నేహితుడు చందు ఇంటి వద్ద మిత్రురాలికి బస ఏర్పాటు చేశాడు.
చందు ఆమెను రాంనగర్లోని తన ఇంటికి తీసుకు వచ్చాడు. ఆయన తన ఇంటి పక్కనే ఉన్న మరో భవనంలో స్నేహితులతో కలిసి ఐదో తేదీన రాత్రి పార్టీ చేసుకున్నారు. గస్తీ తిరుగుతున్న పోలీసులు వచ్చారు. వారిని చూసి చందు, ఆయన స్నేహితులు ఎవరికి వారు పరుగు తీశారు. సమీపంలో ఉన్న ఆ యువతి ఈ హఠత్పరిణామంతో గందరగోళంలో పడింది.

ఆమె కూడా మరోచోటకు వెళ్లింది. కారులో అటువైపు వస్తున్న యేర్నేంద్ర రావు, శివ, సునీల్‌ల కంటపడింది. సహాయం చేస్తామని వారు ఆమెకు మాయమాటలు చెప్పారు. ఆమెను కారులో ఎక్కించుకున్నారు. రాత్రంతా యువతిని కార్లు మార్చిమార్చి తిప్పుతూ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.
యేర్నేంద్ర రావు ఆమె పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆరో తేదీన తెల్లవారుజామున్న మూడున్నర గంటలకు విశాఖలోని రైల్వే స్టేషన్లో వదిలేసి వెళ్లిపోయారు. బాధితురాలు జరిగిందంతా చందూకు ఫోన్ చేసి చెప్పింది. ఆమెను వైద్య సేవల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఆ రోజు సాయంత్రం చందూ.. ఆ యువతితో కలిసి ప్లాన్ చేసి నిందితులను పట్టించారు. విజయవాడ వెళ్లేందుకు తనకు డబ్బులు అవసరమని ఆమెతో చందూ నిందితులకు ఫోన్ చేయించాడు. నిందితులు ముగ్గురు అక్కడకు వచ్చారు. చందూ వారిని నిలదీశాడు. వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అక్కడకు వచ్చిన నిందితులు ఇద్దరు పరారయ్యారు. మూడో నిందితుడు శివను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత పారిపోయిన ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. నిందితులు వాడిన రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, నిందితులు బాధితురాలిని కారులో వేధించిన సమయంలో ఆమె ఫోన్ నెంబరును ఫీడ్ చేసుకున్నారు. ఆ తర్వాత పలుమార్లు ఫోన్ చేసి వేధించినట్లుగా తెలుస్తోంది.
-
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications