కాబోయే భర్తపై దాడి: రెండు రోజుల్లో పెళ్లనగా యువతిపై గ్యాంగ్ రేప్

హైదరాబాద్: మగ దురహంకారానికి, కీచకపర్వానికి మరో యువతి బలైంది. వరంగల్ జిల్లా బాలాజీ నగర్‌లో కొంతమంది వ్యక్తులు రెండు రోజుల్లో పెళ్లి కావాల్సిన యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాబోయే భర్తతో కలిసి వెళుతున్న యువతిపై గ్యాంగరేప్ చేశారు. అడ్డు వచ్చిన కాబోయే భర్తపై దాడి చేసి వారు యువతిని కిడ్నాప్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డ దుండుగులపై కేసు నమోదు చేశారు

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

నల్గొండ జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. తుంగతుర్తి మండలం పసునూరు వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ట్రాక్టర్‌లు ఢీ కొన్నాయి. ఆ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందాడు. దీంతో పసునూరు గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

Girl gang raped in Wrangal district

మరో రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాగనూరు మండలం వడ్వాస్‌గేటు దగ్గర బైక్‌ కారును ఢీ కొంది. ఈ రో్డ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటనాస్థలం వద్దకు చేరుకుని కేసు నమోదు చేశారు

గుప్తనిధుల కోసం వేట

గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌ మండలం గీర్మాపూర్‌లో గత కొద్ది రోజులుగా ముగ్గురు దుండుగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారని పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగం లోకి వారిని అరెస్ట్ చేశారు.

చోరీ చేస్తూ దొరికిపోయారు...

హైదరాబాదులోని హుమాయన్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని సత్యశ్రీ అర్కేడ్‌లో దొంగతనం జరిగింది. శనివారం తెల్లవారు జామున మూడున్నర గంటల ప్రాంతంలో సత్యసాయి ఆర్కేడ్‌లోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు ఒక ఫ్లాట్‌లో దొంగతనం చేసి మరో ఫ్లాట్‌లో చొరబడి చోరీకి ప్రయత్నించారు. ఈ స్థితిలో చుట్టుపక్కల వాళ్లు అప్రమత్తమై వారిని పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి దొంగలను అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+