ఎనిమిది నెలలుగా బాలికపై రేప్: అధికార పార్టీ నేత ఘాతుకం
హైదరాబాద్: అధికార పార్టీకి చెందిన అరవై మూడేళ్ల వృద్ధ నేత తనపై గత ఎనిమిది నెలలుగా అత్యాచారం చేస్తున్నాడని ఓ బాలిక సోమవారం విశాఖపట్నం పోలీస్ కమీషనర్‌కి ఫిర్యాదు చేసింది. కోటవీధి ప్రాంతానికి చెందిన బాలిక విశాఖ పోలీస్ కమీషనర్ ముందు తనకు జరుగుతున్న అన్యాయాన్ని విన్నవించుకుంది.
63 ఏళ్ళ వృద్ధుడు ఫరీద్ తనపై 8 నెలలుగా అత్యాచారం చేస్తున్నాడని ఆమె తెలిపింది. అతను అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడ ంతో డబ్బు ఇచ్చి తప్పించుకుంటున్నాడని ఆమె పోలీస్ కమీషనర్‌కు తెలిపింది.

మాజీ ఎమ్మెల్యే కూతురు మృతి
ఇదిలావుంటే, గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వెల్లలూరు సమీపంలో ఆర్టీసీ బస్సు, కారు డీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే చిట్టినేని కుమార్తె పద్మావతి మరణించారు. ఆమె భర్త పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన భర్తను ఆసుపత్రికి తరలించారు.
నవదంపతుల మృతి
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కాట్రపాడు గ్రామంలో ప్రమాదవశాత్తు నవదంపతులు మృతి చెందడంతో విషాదం అలముకుంది. బట్టలు ఆరేస్తుండగా భార్యకు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో భార్యను కాపాడబోయి భర్త కూడా మరణించాడు.
శనక దాష్టీకం
కుక్కల భయంతో విజయనగరం పట్టణ ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. పిచ్చికుక్కలు, వీధికుక్కల స్వైరవిహారంతో ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటే భయంతో వణికి పోతున్నారు. సాలూరు బంగారమ్మ కాలనీలో ఒక పిచ్చికుక్క స్వైర విహారం చేసి దొరికిన వారిని దొరికినట్లు కరిచేసింది. పిచ్చికుక్క దాడిలో ఆరుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. వీధికుక్కలు కరవడంతో మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.












Click it and Unblock the Notifications