యువతిని చీరలతో కట్టేసి నగల దోపిడీ
విజయవాడ: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్‌లో ఓ యువతిని చీరలతో కట్టేసి ఆమె ఒంటిపై ఉన్న నగలను దోచుకుని ఇద్దరు దొంగలు పరారయ్యారు. ఈ ఘటన రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు గ్రామంలో గల నవభారత్ నగర్ ప్రాంతంలో శనివారం ఉదయం చోటు చేసుకుంది.
ఎం అమల అనే యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇద్దరు దుండగులు లోనికి ప్రవేశించి ఆణెను చీరలతో కట్టేశారు. ఆ తర్వాత ఆమె మెడలోని గొలుసును, ఇతర నగలను దోచుకుని పరారయ్యారు. అవి ఐదున్నర కాసులు ఉంటాయని అంచనా.

గుంటూరు జిల్లాలోని పొన్నూరు మండలం మన్నవ గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ రోశయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. పొన్నూరు ఎస్‌ఐ చరణ్ వేధింపులే కారణమని సూసైడ్ నోట్‌లో రోశయ్య రాసి చనిపోయాడు. ఒక యాక్సిడెంట్ కేసులో సంబంధం లేకపోయినా కేసు నమోదు చేసి వేధించడమే తన ఆత్మహత్యకు కారణమని రాజారావు తన లేఖలో చెప్పాడు.
బొనిగల రోశయ్య (35) అనే వ్యక్తి ఈ నెల 26వ తేదీన విధుల్లో భాగంగా బస్సు నడుపుతుండగా ఎదురుగా బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి ఢీకొట్టి చనిపోయాడు. అతని మృతికి రోశయ్యే కారణమంటూ ఎంవి చరణ్ కేసు నమోదు చేశారు. ఇదే విషయంపై ఎస్ఐ తనను వేధిస్తున్నాడంటూ రోశయ్య ఆందోళనకు గురయ్యాడు. రోశయ్య బంధువులు పోలీసు స్టేషన్ ముందు ధర్నాకు దిగారు.












Click it and Unblock the Notifications