ఘోరం: హాస్టల్ పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య.. ఏం జరిగిందో?

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని విద్యా వికాస్ జూనియర్ కళాశాల వసతిగృహంలో ఉంటూ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న స్వప్న నాయక్(17) అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.

జంగారెడ్డిగూడెం అర్భన్: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని విద్యా వికాస్ జూనియర్ కళాశాల వసతిగృహంలో ఉంటూ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న స్వప్న నాయక్(17) అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.

శుక్రవారం ఉదయం ఆమె హాస్టల్ భవనం పైనుంచి దూకి ఈ అఘాయిత్యానికి పాల్పడింది. స్వప్న తలకు బలమైన గాయం కావడంతో కళాశాల యాజమాన్యం వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించింది.

 Girl Student jumps of college hostel building, dies

అయితే అప్పటికే స్వప్న మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు సమాచారం అందుకుని కళాశాలకు చేరుకున్న స్వప్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

పరీక్షల సమయం దగ్గర పడడంతో 15 రోజుల క్రితమే తమ కుమార్తెను వసతిగృహంలో చేర్పించామని, ఇంతలోనే ఇలా జరిగిందంటూ స్వప్న తండ్రి శిశుపాల్ నాయక్ విలపించారు. అయితే స్వప్న ఆత్మహత్య ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+