ప్రియుడితో పరారీ: తల్లిదండ్రులు మందలించారని పోలీస్ స్టేషన్‌లో చెవి కమ్మ మింగింది
అమరావతి: తల్లిదండ్రులు మందలించారనే కారణంతో ఓ విద్యార్ధిని పోలీస్ స్టేషన్‌లోని వాష్ రూమ్‌కు వెళ్లి చెవి కమ్మ మింగిన సంఘటన అనంతపురం జిల్లాలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే జిల్లాలోని పుట్టపర్తి మండలం వెంగలమ్మచెరువు గ్రామానికి చెందిన నాగలక్ష్మీ పెనుకొండలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతుంది.
అదే కాలేజీలో చదువుతోన్న పెనుకొండ మండలం కుబవాండ్లపల్లికి చెందిన నాగరాజుతో ప్రేమలో పడింది. ఈ క్రమంలో గత నెల 20న పెనుకొండలో మూడో సంవత్సరం పరీక్షలకు హాజరైన వీరిద్దరూ అదృశ్యమయ్యారు. దీంతో విద్యార్ధిని తల్లిదండ్రులు పెనుకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకుని వీరిద్దరిని బెంగుళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు పెనుకొండకు తీసుకు వచ్చారు. సోమవారం వీరిద్దరిని కోర్టుకు హాజరు పరిచేందుకు పోలీసులు సిద్ధం చేశారు. ఈ సమయంలో స్టేషన్‌లోనే తల్లిదండ్రులు మందలించడంతో అక్కడే విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం చేసింది.
వెంటనే నాగలక్ష్మీ స్టేషన్‌లోని వాష్ రూమ్‌లోకి వెళ్లి చెవి కమ్మ మింగింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు చెప్పగా వారు అక్కడ నుంచి ఆమెను పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం విద్యార్థినితోపాటు ప్రియుడిని రెవెన్యూ అధికారి మనోజ్‌రెడ్డి ఎదుట హాజరు పరచి మెరుగైన వైద్యం కోసం హిందూపురం ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications