ప్రేమించిన వ్యక్తితో తప్పు చేశానని యువతి సూసైడ్ యత్నం

రాజమహేంద్రవరం: ప్రేమించిన వ్యక్తికి శారీరకంగా దగ్గరైన ఓ యువతి, అతను పెళ్లికి నిరాకరించడంతో ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన యువతి కాకినాడలో ఇంటర్ చదివింది.

16 ఏళ్ల ప్రేమ, వివాహేతర సంబంధం: ఇంట్లో తెలిసి ఆత్మహత్యాయత్నం

ఆ తర్వాత నర్స్‌గా శిక్షణ పొంది, ఉద్యోగం చేస్తోంది. చీరాలకు చెందిన జీవన్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమకు దారి తీసింది. ఇరువురు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా వారు శారీరకంగా కూడా ఒక్కటయ్యారు.

Girl tries to suicide in East Godavari

కొద్ది రోజుల తర్వాత ఆమె పెళ్లి గురించి అతనిని అడిగింది. తాను పెళ్లి చేసుకోనని అతని తేల్చి చెప్పాడు. దీంతో ఆమె నిద్రమాత్రలు మింగి, ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

అనుమానంతో భార్య హత్య

ఓ వ్యక్తి అనుమానంతో తన భార్యను హత్యాయత్నం చేసిన సంఘటన విజయవాడలో జరిగింది. కానూరులో ఉంటున్న మహేష్ అనే వ్యక్తి కారు డ్రైవర్‌గా పన చేస్తున్నాడు. అతనికి తేజస్విని అనే యువతితో ఏడాది క్రితం వివాహం జరిగింది.

ఇద్దరు ఆరు నెలల పాటు బాగానే ఉన్నారు. అనంతరం భార్య పైన అతనికి అనుమానం వచ్చింది. దీంతో నిత్యం వేధించేవాడు. ఈ నెల 17వ తేదీన ఆమె తల్లి, చెల్లితో కలిసి వెళ్తుండగా.. కొబ్బరి బొండాలు నరికే కత్తితో తేజస్విని పైన దాడి చేశాడు. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు మంగళవారం నాడు మహేష్‌ను అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+