వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిన్న,రెచ్చగొట్టే డ్రెస్‌లతో పబ్‌లకొద్దు: గర్ల్స్‌కు గోవా మంత్రి

By Srinivas
|
Google Oneindia TeluguNews

పనాజీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మంత్రివర్గంలోని ఓ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు షార్ట్ డ్రెస్సులతో పబ్‌లకు వెళ్లడాన్ని గోవా మంత్రి సుదిన్ దవళికర్ వ్యతిరేకిస్తున్నారు. యువతులు చిన్న చిన్న డ్రెస్‌లతో పబ్స్‌కు వెళ్లడం మన సంస్కృతికి విరుద్ధమని ఆయన అన్నారు.

అలాంటి అలవాట్లకు యువతులు స్వస్తి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇది ఇలాగే కొనసాగితే మన సంస్కృతి ఏం కానుందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న దుస్తులతో యువతులు పబ్‌కు వెళ్లడం ద్వారా మన సంస్కృతికి తప్పుడు బీజాలు వేసిన వాళ్లు అవుతున్నారన్నారు.

Girls visiting pubs in short dresses against culture: Goa minister

దీనిని ఆపేయవల్సి ఉందని అభిప్రాయపడ్డారు. రెచ్చగొట్టేలా దుస్తులు వేసుకుని పబ్బులకెళ్ళడం సరికాదన్నారు. ముతాలిక్ చెప్పిన దాంట్లో తప్పు లేదన్నారు. ముతాలిక్ ఏ మతానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడే స్వేచ్ఛ ఉందన్నారు.

కాగా, భారతీయ సంస్కృతిని నాశనం చేస్తున్నారని ఆరోపిస్తూ శ్రీరామ్ సేన 2009లో మంగళూరులో పబ్‌లో యువతులు, యువకుల పైన దాడికి పాల్పడింది. శ్రీరామ్ సేనను ముతాలిక్ స్థాపించారు. ఇటీవల ఆయన బీజేపీలోకి వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే అది ఆగిపోయింది. ఈ నేపథ్యంలో పబ్‌ల పట్ల ముతాలిక్ తీరును ఆయన సమర్థించారు. ముతాలిక్ పబ్ కల్చర్‌కు పూర్తిగా వ్యతిరేకమని, దానిని ఆయన వ్యతిరేకించడం సరైనదేనని అభిప్రాయపడ్డారు. మరోవైపు, సుదిన్ వ్యాఖ్యంలు కలకలం రేపాయి.

English summary
A senior minister in the Manohar Parrikar-led BJP government in Goa has echoed controversial Sriram Sene chief Pramod Muthalik saying that the practice of young girls visiting pubs in short dresses is against local culture and should be stopped.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X