సమాచారం ప్రభుత్వానికి చేరవేస్తారేమో, నేను కోరిన గన్‌మెన్లనే ఇవ్వండి: వైసీపీలో చేరిన ఆమంచి
ఒంగోలు: కొద్ది రోజుల క్రితం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ శుక్రవారం జిల్లా ఎస్పీ ప్రవీణ్‌ను కలిశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని తాను సూచించిన వారిని తనకు గన్‌మెన్లుగా ఇవ్వాలని కోరారు. అలాగే, చీరాల నియోజకవర్గంలో ఇటీవల జరిగిన పరిణామాలు, తన కార్యకర్తలపై దాడి విషయాలను ఎస్పీ దృష్టికి తీసుకు వెళ్లారు.
ఇప్పటి వరకు గన్‌మెన్లుగా ఉన్న వారిని వెనక్కి తీసుకోవడంపై ఎస్పీతో మాట్లాడారు. గన్‌మెన్లు తమకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వానికి చేరేవేసే అవకాశముందని, రాజకీయాల్లో ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, కాబట్టి తాను సూచించిన వారినే తనకు గన్‌మెన్లుగా నియమించాలని ఎస్పీని కోరారు. తన విజ్ఞప్తికి ఎస్పీ సానుకూలంగా స్పందించారని చెప్పారు.

రెండు రోజుల క్రితం చీరాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే ఆమంచి వర్గీయులపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసినట్లుగా వైసీపీ వర్గీయులు ఆరోపించారు. గ్రామసభలో పాల్గొనేందుకు వెళ్లిన ఆమంచి వర్గీయులపై దాడి చేశారని చెప్పారు. ఈ అంశాన్ని ఆమంచి ఎస్పీ దృష్టికి తీసుకు వెళ్లారు.
కాగా, ఆమంచి వారం క్రితం వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. హైదరాబాదులో వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications