మళ్లీ మొదటికి గాజు గ్లాస్ వివాదం-మరోసారి ఈసీ, హైకోర్టుకు కూటమి..!
ఏపీలో గాజు గ్లాసు గుర్తుపై నెలకొన్న ప్రతిష్టంభన ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. జనసేన పోటీ చేసే నియోజకవర్గాలతో పాటు పోటీ చేయని సీట్లలో కూడా ఇండిపెండెంట్లకు ఇతర పార్టీల అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో ఆ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై స్పందించిన ఈసీ.. నిబంధనల ప్రకారం జనసేన పోటీ చేసే ఎంపీ సీట్లు, వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సీట్లలో మాత్రం ఇతరులకు గాజు గ్లాసు ఇవ్వబోమని తెలిపింది.
అయితే ఎన్డీయే కూటమి నేతలు ఈసీ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. హైకోర్టు ఆదేశాలను ఈసీ సరిగా అర్ధం చేసుకోకుండా ఈ నిర్ణయం తీసుకుందన్నారు. హైకోర్టు చెప్పిన దాని ప్రకారం జనసేన పోటీ చేసే ఎంపీ సీట్లు, వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సీట్లతో పాటు ఇతర అసెంబ్లీ సెగ్మెంట్లలో జనసేన పోటీ చేస్తుంటే ఆ లోక్ సభ సీట్ల పరిధిలోనూ ఎవరికీ గాజు గ్లాసు గుర్తు ఇవ్వొద్దని కూటమి నేతలు ఈసీని కోరారు. అక్కడ కూటమి అభ్యర్దులు పోటీలో ఉండటమే ఇందుకు కారణం.

ఈసీ తాజాగా రిటర్నింగ్ అధికారులకు నిబంధల ప్రకారం ఎన్నికల సంఘం వద్ద నమోదై, గుర్తింపు పొందని ఇతర రాజకీయ పార్టీల తరహాలోనే జనసేన పార్టీకి కేటాయించిన గాజు గ్లాసు గుర్తును ఆ పార్టీ పోటీ చేసే లోక్ సభ సీట్లు, వాటి పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ ఇతరులకు కేటాయించకుండా ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇప్పుడు కూటమి మాత్రం ఇవి కాకుండా మిగిలిన చోట్ల ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో జనసేన పోటీ చేస్తున్నా ఆ పార్లమెంట్ సీటు పరిధిలో ఎక్కడా ఇతరులకు గాజు గ్లాసు సింబల్ ఇవ్వొద్దని కోరుతోంది. దీనిపై మరోసారి ఈసీతో పాటు హైకోర్టునూ ఆశ్రయిస్తోంది.












Click it and Unblock the Notifications