హర్షా ... నిన్ను చూసి గర్వపడుతున్నా : కుమార్తె ను చూసి మురిసిన జగన్ - భారతి..!!

ముఖ్యమంత్రి జగన్ - భారతి తమ కుమార్తెను చూసి మురిసిపోయారు. కుమార్తె ఎదుగూరి సందింటి హర్షిణి రెడ్డి. ప్రఖ్యాత పారిస్ లోని ఇన్సీడ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పట్టా అందుకున్నారు. ఈ కాన్వకేషన్ లో తమ కుమార్తె పట్టా అందుకోవటం ప్రత్యక్షంగా చూసేందుకు సీఎం జగన్ - భారతి దంపతులు పారిస్ వెళ్లారు. ఈ రోజు అక్కడ ఈ పట్టా ప్రధానం జరిగింది. దీంతో.. కుమార్తె ఎదుగుదల - మాస్టర్స్ డిగ్రీ పట్టా అందుకోవటంతో జగన్ ట్వీట్ చేసారు. అందులో.. కుమార్తు ప్రతిభను అభినందించారు.

డీన్ లిస్టులో ప్రఖ్యాత ఇన్సీడ్ యూనివర్సిటీ నుంచి డిప్టింక్షన్ లో పాసవ్వటం.. పట్టా అందుకోవటం పట్ల సంతోషం వ్యక్తం చేసారు. ఆ దేవుడి దయ తో అంతా మంచి జరగాలని తండ్రిగా సీఎం జగన్ ఆకాంక్షించారు. సీఎం జగన్ - భారతి ఇద్దరూ పట్టా అందుకున్న హర్షా రెడ్డితో దిగిన ఫొటోను జత చేసారు. జగన్ కుమార్తెలు ఇద్దరూ హర్ష - వర్ష చదవుల్లో తొలి నుంచి డిస్టింక్షన్ లో రాణిస్తున్నారు. సీఎం జగన్ రాజకీయాల్లో ఉన్నా.. వారిద్దరి చదవు వ్యవహారాలు పూర్తిగా భారతి చూసేవారు. పారిస్‌ లోని ప్రతిష్టాత్మక ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో సీటు దక్కించుకున్నారు. దీంతో..సీఎంగా జగన్ బాధ్యతలు తీసుకున్న తొలి నాళ్లల్లో బెంగుళూరు వెళ్లి తన కుమార్తెను పారిస్ కు పంపారు. ఇప్పుడు అదే యూనివర్సిటీలో డిస్టింక్షన్ లో హర్షా మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు.

https://telugu.oneindia.com/news/andhra-pradesh/ips-officer-ab-venkateswara-rao-new-duty-321184.html

రేపు సీఎం జగన్ తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు. ఈ నెల 4వ తేదీన ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఉండటంతో..సీఎం ముందుగానే ఏపీకి తిరిగి రానున్నారు. 5వ తేదీన సీఎం జగన్ కర్నూలు జిల్లా ఆదోనీలో పర్యటించనున్నారు. విద్యా కానుక కిట్లను అక్కడ ప్రారంభించనున్నారు. ఇక, ఈ నెల 8,9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ ఉండటంతో అప్పటి వరకు ముఖ్యమంత్రి జగన్ బీజీ షెడ్యూల్ ఖరారైంది. 6 లేదా 7వ తేదీల్లో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రైపదీ ముర్ము ఏపీకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ముర్ముకు వైసీపీ మద్దతు ప్రకటించింది. ఇక, ప్లీనరీ వేదికగా కీలక ప్రకటనలకు సీఎం జగన్ సిద్దం అవుతున్నారు. ఇప్పుడు తన కుమార్తెను సీఎం జగన్ అభినందిస్తూ చేసిన ట్వీట్ పార్టీ అభిమానుల్లో వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+