అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబుతో కల్సి ప్రమాణం: డిసిఎం సస్పెన్స్, కేబినెట్లో వీరు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తన మంత్రివర్గంపై కసరత్తు దాదాపు పూర్తి చేశారట. జూన్ 8వ తేదీన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. చంద్రబాబుతో పాటు దాదాపు 20 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని సమాచారం. మంత్రివర్గంపై చంద్రబాబు కసరత్తు దాదాపు చివరి దశకు వచ్చిందని సమాచారం.

సమాచారం మేరకు... చంద్రబాబు కేబినెట్లో ఉభయ గోదావరి జిల్లాలకు ఎక్కువ ప్రాధాన్యం దక్కనుంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కో జిల్లా నుండి ముగ్గురికి అవకాశం ఇవ్వనున్నారని సమాచారం. తద్వారా ఉభయ గోదావరి జిల్లాలకు కేబినెట్లో ఆరుగురు మంత్రులు ఉండే అవకాశముంది. ఆరుగురిలో ఒకటి బిజెపికి వెళ్లనుంది.

 Godavari districts to get six Cabinet posts

అవకాశం వీరికేనా?

సమాచారం మేరకు... చంద్రబాబుతో పాటు ఇరవై మంది వరకు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. మంత్రివర్గంలో... అప్పలనాయుడు (గజపతినగరం), అయ్యన్నపాత్రుడు (నర్సీపట్నం), నిమ్మకాయల చినరాజప్ప (పెద్దాపురం), గొల్లపల్లి సూర్యారావు (రాజోలు), ముడియం శ్రీనివాస్ (పోలవరం), పీతల సుజాత (చింతలపూడి), మండలి బుద్ధప్రసాద్ (అవనిగడ్డ), దేవినేని ఉమామహేశ్వర రావు (మైలవరం), కోడెల శివప్రసాద రావు (సత్తెనపల్లి), దూళిపాళ్ల నరేంద్ర (పొన్నూరు), జనార్ధన్ (ఒంగోలు), సిద్దా రాఘవ రావు (దర్శి), బొల్లినేని రామారావు (ఉదయగిరి), బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి (శ్రీకాళహస్తి), పరిటాల సునీత (రాప్తాడు), పల్లె రఘునాథ రెడ్డి (పుట్టపర్తి), కెఈ కృష్ణమూర్తి (పత్తికొండ), మల్లికార్జున రెడ్డి (రాజంపేట)లకు దాదాపు బెర్త్‌లు ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ సతీష్‌కు కూడా బెర్త్ ఖాయమైందని సమాచారం.

మహిళా కోటా కింద కిమిడి మృణాళిని (చీపురుపల్లి)కి బెర్త్ దక్కనుందని తెలుస్తోంది. కళా వెంకట్రావుకు ఈసారి దక్కక పోవచ్చునని సమాచారం. శాసనమండలి పక్ష నేత యనమల రామకృష్ణుడును కేబినెట్లోకి తీసుకునే విషయమై ఇంకా చర్చ సాగుతోందని తెలుస్తోంది.

గొల్లపల్లి సూర్యారావుకు మంత్రి పదవి లేదా స్పీకర్ పోస్ట్ రానుంది. చంద్రబాబు కేబినెట్లో బిజెపి నుండి కామినేని శ్రీనివాస రావు (కైకలూరు)కు అవకాశం దక్కనుందని సమాచారం.

ఉప ముఖ్యమంత్రి పదవి ఎవరికో...?

ప్రచారం సమయంలో చంద్రబాబు బిసిలకు ఒకటి, కాపులకు ఒకటి... ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బిసి వర్గానికి చెందిన కెఈ కృష్ణమూర్తిని డిప్యూటీ సీఎం పదవి వరించే అవకాశముంది. కాపు సామాజిక వర్గం నుండి నారాయణ ఎడ్యుకేషనల్ సంస్థల చైర్మన్ నారాయణ పేరును పరిశీలిస్తున్నారట. అయితే నారాయణ ఇటు ఎమ్మెల్సీ లేదా అటు ఎమ్మెల్యే కాదు. నారాయణను డిప్యూటీ సిఎంగా చేస్తే అతనిని మండలికి పంపిస్తారు.

English summary
Along with Chandrababu Naidu, 17 to 20 ministers are also likely to take oath on June 8. The Chief Minister-designate and TDP chief Chandrababu Naidu, almost completed the exercise on the formation of the new Cabinet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X