ఏపీలో 12 లక్షల క్యూసెక్కులకు వరద: డేంజర్ జోన్‌లో ఈ జిల్లాలు

Godavari floods 2024: ఇటీవలే కురిసిన భారీ వర్షాలు, దానివల్ల సంభవించిన వరదల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలను అల్లకల్లోలానికి గురయ్యాయి. దారుణంగా దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా ఉండట్లేదు. నదులు, చెరువులు ఏకం అయ్యాయి. జనావాసాలన్నీ జలమయం అయ్యాయి.

ప్రత్యేకించి- రాజధాని అమరావతి ప్రాంతం మొత్తం నీట మునిగింది. విజయవాడలో ఇదే పరిస్థితి నెలకొంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో వరద ఉధృతి నెలకొంది. వేలాదిమందిని ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రదేశాలకు తరలించారు అధికారులు.

Godavari floods 2024 Flood levels at Bhadrachalam has crossed 49 feet

అదే తరహా పరిస్థితులు తెలంగాణలోనూ ఏర్పడ్డాయి. ప్రత్యేకించి- ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సూర్యాపేట్ జిల్లాలు దారుణంగా దెబ్బతిన్నాయి. విజయవాడలో బుడమేరు తరహాలోనే ఖమ్మంలో మున్నేరు వాగు పొంగిపొర్లింది. ఈ నగరాన్ని ముంచెత్తింది. మున్నేరు ఉధృతికి పలు కాలనీలు జలమయం అయ్యాయి.

ఇప్పుడు ఇదే తరహా పరిస్థితులు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో సంభవించే ప్రమాదం లేకపోలేదు. గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతూ పోతోండటమే దీనికి ప్రధాన కారణం. తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ప్రమాదకరంగా పెరిగింది. ప్రస్తుతం 49.1 అడుగులకు చేరింది.

మహారాష్ట్ర ఎగువ పరివాహక ప్రాంతాలు, ఉపనదుల్లో కొద్ది రోజులుగా కురుస్తోన్న వర్షాల వల్ల గోదావరి నది నీటిమట్టం గణనీయంగా పెరుగుతోంది. వివిధ ప్రాజెక్టుల నుంచి విడుదల చేసిన వరద జలాలు దీనికి తోడయ్యాయి. మహారాష్ట్రలోని నాందేడ్‌ సహా గోదావరి పరీవాహక ప్రాంతాల్లో నీటి మట్టం గరిష్ఠస్థాయికి చేరుకుంటోంది.

ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, కిన్నెరసాని, శబరి వంటి ఉపనదుల వరద ప్రవాహం అధికంగా ఉండటం వల్ల గోదావరి క్రమంగా ఉప్పొంగుతోంది. నదీ పరీవాహక ప్రాంతాల్లో ఇప్పటికే హైఅలర్ట్ జారీ అయింది. మున్ముందు నదీ నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తోన్నారు.

మంగళవారం రాత్రి నాటికి భద్రాచలం వద్ద 49.1 అడుగుల నీటి మట్టం నమోదైనట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావం తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజీపై పడింది. ఇన్ ఫ్లో ఇన్‌ఫ్లో 10,28,640 లక్షల క్యూసెక్కులకు చేరింది. వచ్చిన వరద నీటిని వచ్చినట్టే దిగువకు విడుదల చేస్తోన్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తోన్నారు.

వరద ప్రవాహం తీవ్రత క్రమంగా 12 లక్షల క్యూసెక్కుల వరకు చేరే అవకాశం ఉన్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+