ఉగ్ర గోదావరి: భద్రాచలం, ధవళేశ్వరంలో కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక; భయం గుప్పిట్లో ముంపుగ్రామాలు!!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుండపోతగా కురుస్తున్న వర్షాలతో పాటు, ఎగువ నుండి వస్తున్న వరదతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నీటిమట్టం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్న పరిస్థితి ఉంది. నేడు ఉదయం 6 గంటల సమయంలో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 46.20 అడుగుల వద్ద ఉంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. అలాగే ధవళేశ్వరం వద్ద కూడా రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది.
రెండు తెలుగు రాష్ట్రాలలోనూ గోదావరి వరదల నేపథ్యంలో ఆందోళనకర పరిస్థితి ఉంది. గోదావరి నదిలో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల అధికారులు అప్రమత్తమయ్యారు. గోదావరి నది పరివాహక ప్రాంతాలలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద కూడా గోదావరి నదికి రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇదిలా ఉంటే ములుగు జిల్లా వాజేడు మండలంలో గోదావరి నదికి వరద పోటెత్తడంతో అనేక ప్రాంతాలు గుంపుకు గురవుతున్నాయి. గోదావరి నది నీటిమట్టం పేరూరు వద్ద ఈరోజు ఉదయం నీటి మట్టం 48.44 అడుగులకు పెరిగింది. వెంకటాపురం భద్రాచలం మార్గంలో బ్రిడ్జి పై వరద ప్రవహిస్తోంది.
వెంకటాపురం వాజేడు మండలాలలో కూడా రోడ్లపైకి భారీగా నీరు చేరుకుంది. గోదావరి వరదల కారణంగా టేకులగూడెం, వీరభద్రవరం , సుర వీడు ప్రాంతాలలో రాకపోకలు నిలిచిపోయాయి.ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ గోదావరి కి కొనసాగుతున్న వరద ఉధృతితో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.
గోదావరి కి కొనసాగుతున్న వరద ఉధృతి భద్రాచలం వద్ద ప్రస్తుతం 46.5 అడుగుల వద్ద కొనసాగుతుందని, ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో,ఔట్ ఫ్లో 13.57 లక్షల క్యూసెక్కులుగా ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీంతో ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని పేర్కొంది. గోదావరి వరదల వల్ల ప్రభావితమయ్యే జిల్లాలలో 42 మండలాలు 458 గ్రామాలు నిరంతరం అప్రమత్తంగా ఉన్నాయని వెల్లడించింది.
అధికారులు అలర్ట్ గా ఉన్నారని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.సహాయచర్యల్లో 3ఎన్డీఆర్ఎఫ్ , 4ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయని, క్షేత్రస్థాయిలో ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారని గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వెల్లడించారు. ఈ మేరకు ఎప్పటికప్పుడు గోదావరి నది వరద పరిస్థితులపై ట్విట్టర్ వేదికగా అప్డేట్ ఇస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications