మూడు కిలోల బంగారాన్ని టాయిలెట్లో పడేశాడు
హైదరాబాద్: కస్టమ్స్ అధికారులు ఎంతగా పట్టుకున్న హైదరాబాదులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి దొంగ బంగారం రావడం ఆగడం లేదు. అధికారుల నిఘాను పసిగట్టిన ఓ వ్యక్తి మూడు కిలోల బంగారాన్ని టాయిలెట్లో పడేశాడు.
ఆ వ్యక్తి నుంచి అధికారులు మరో రెండు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతానికి చెందిన నజీర్ (35) ఒమన్ ఎయిర్‌లైన్స్ విమానంలో బుధవారం సాయంత్రం ఆరు గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు.

అతను బంగారం అక్రమంగా తీసుకుని వస్తున్నట్లు సమాచారం అందుకున్న డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) అధికారులు అప్రమత్తమై నిఘా పెట్టారు. అధికారుల నిఘాను పసిగట్టిన నజీర్ తన లగేజీలో ఉన్న మూడు కిలోల బంగారాన్ని విమానాశ్రయంలోని బాత్రూంలోకి వెళ్లి కుండీలో పడేశాడు. అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కుండీలోంచి బంగారాన్ని వెలికి తీశారు
ఇదిలావుంటే, శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం దుబాయ్ నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడి వద్ద 500 గ్రాముల బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వస్తున్న ఎమిరేట్స్ సంస్థ విమానంలో కొందరు ప్రయాణికులు దొంగచాటుగా బంగారం తెస్తున్నారని ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో ఆ విమానంలో వచ్చిన ప్రయాణికులందరిని తనిఖీ చేస్తుండగా నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ ప్రయాణికుడి వద్ద 500 గ్రాముల బంగారం దొరికింది.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
Silver షేక్ చేస్తుంది: 45 ఏళ్ల తర్వాత కమ్ముకున్న చీకట్లు. -
Gold: భారీగా పెరిగిన బంగారం ధరలు. పసిడి మార్కెట్లో పూనకాలు -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications