వైఎస్ జగన్‌కు థ్యాంక్స్ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్..!!
అమరావతి: తెలుగు చలన చిత్ర పరిశ్రమ సత్తాను చాటి చెప్పిన మరో మూవీ ఆర్ఆర్ఆర్. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్ సినిమా కలెక్షన్ల సునామీని సృష్టించింది. బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా అందుకున్న బాక్సాఫీస్ కలెక్షన్లు 1,000 కోట్ల రూపాయల మార్క్‌ను దాటేశాయి. 1,119 కోట్ల రూపాయల క్లోజింగ్ బిజినెస్‌ను రికార్డ్ చేసింది.
జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, ఆలియా భట్, అజయ్ దేవ్‌గణ్ నటించిన ఈ పాన్ ఇండియా సినిమా తృటిలో ఆస్కార్ అవార్డ్ కోసం పోటీ పడుతోంది. అదే సమయంలో న్యూయార్క్ క్రిటిక్స్ నుంచి బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో టాప్‌లో నిలిచింది. బెస్ట్ డైరెక్టర్ అవార్డును రాజమౌళి అందుకున్నారు. అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీలో అత్యుత్తమంగా నిలిచింది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ స్పాట్‌లైట్ అవార్డును కూడా అందుకుందీ మూవీ.

ఇప్పుడు తాజాగా ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ 2023 అవార్డును అందుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ అవార్డును అందుకుంది. ఈ సినిమాలోని సూపర్ హిట్ పాట నాటు నాటు.. ఈ కేటగిరీలో బెస్ట్ ఒరిజినల్ ట్రాక్ అవార్డును సొంతం చేసుకుంది. అమెరికా కాలిఫోర్నియాలోని బేవర్లీ హిల్స్ లోని బేవర్లీ హిల్టన్ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి.. ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
Thank You Very much Sir 🙏
— mmkeeravaani (@mmkeeravaani) January 11, 2023
కాగా- ఈ అవార్డు దక్కడంపై చిత్రం యూనిట్‌పై ప్రశంసల సునామీ కురిసింది. ఆర్ఆర్ఆర్ టీమ్‌ను అభినందిస్తూ సోషల్ మీడియాలో వేల సంఖ్యలో ట్వీట్లు పోస్ట్ అయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి- ఆర్‌ఆర్‌ఆర్ యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ వేదికపై తెలుగు జెండాను రెపరెపలాడించారని ప్రశంసించారు. తెలుగువాడికి ఇది గర్వకారణమని, మూవీ యూనిట్‌ను చూసి తాము గర్వపడుతున్నామని చెప్పారు.
The #Telugu flag is flying high! On behalf of all of #AndhraPradesh, I congratulate @mmkeeravaani, @ssrajamouli, @tarak9999, @AlwaysRamCharan and the entire team of @RRRMovie. We are incredibly proud of you! #GoldenGlobes2023 https://t.co/C5f9TogmSY
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 11, 2023
సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, దర్శకుడు రాజమౌళి, నటులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సహా మొత్తం ఆర్‌ఆర్‌ఆర్ యూనిట్‌కు అభినందిస్తున్నానంటూ ట్వీట్ చేశారు వైఎస్ జగన్. దీనికి జూనియర్ ఎన్టీఆర్, ఎంఎం కీరవాణి స్పందించారు. తమకు అభినందనలు తెలియజేసిన వైఎస్ జగన్‌కు జూనియర్ ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపాడు. థ్యాంక్యూ వెరీమచ్ సర్ అంటూ జూనియర్, కీరవాణి ఆయన ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు.












Click it and Unblock the Notifications