పెళ్లింట్లో దొంగల దోపిడీ .. బంగారం చోరీ ; ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ఏం చేశారో తెలుసా ?

మేళతాళాలతో, వేద మంత్రాలతో, బంధుమిత్రుల సమక్షంలో, ఉన్నంతలో సంతోషంగా అమ్మాయికి పెళ్లి చేయాలని భావించిన ఓ పేద కుటుంబానికి ఊహించని షాక్ తగిలింది. పట్టపగలే దోపిడి దొంగలు ఇంట్లో బీరువాలో దాచిన బంగారాన్ని డబ్బును ఎత్తుకెళితే ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆ కుటుంబం అనుభవించిన బాధ వర్ణనాతీతం. అయితే అలాంటి సమయంలో నేనున్నానని, మిమ్మల్ని ఆదుకుంటా అంటూ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే మంచితనం పై అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది.

మూడు నెలల్లో కూతురు పెళ్లి .. కూడబెట్టిన బంగారం చోరీ

మూడు నెలల్లో కూతురు పెళ్లి .. కూడబెట్టిన బంగారం చోరీ

మూడు నెలల్లో కూతురు పెళ్లి చేయాలని, కష్టపడి దాచుకున్న బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన కడప జిల్లా పొద్దుటూరు లోని స్థానిక వైఎంఆర్ కాలనీలో జరిగింది. అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న రాజేశ్వరి ఇంట్లో పట్టపగలే దొంగలు బీరువాలో దాచి ఉంచిన 10 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. కూతురు పెళ్లి కోసం ఎంతో కష్టపడి సంపాదించి ఆమె దాచుకున్న బంగారం దొంగల పాలు కావటంతో ఆమె కుటుంబం తీవ్ర ఆవేదనలో మునిగిపోయింది.

 మగ పెళ్లి వారికి ఇస్తానన్న బంగారం చోరీ

మగ పెళ్లి వారికి ఇస్తానన్న బంగారం చోరీ

భర్త విదేశాలకు వెళ్లి కూలీగా కష్టపడి పని చేయడంతో వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్న రాజేశ్వరి, మగపెళ్లి వారికి ఇస్తానన్న 10 తులాల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్ళడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. కాయకష్టం చేసుకుని జీవనం సాగించే రాజేశ్వరి కూతురు పెళ్లి కోసం దాచిపెట్టిన బంగారాన్ని తిరిగి కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉంది. ఈ క్రమంలో కూతురు పెళ్లి ఆగిపోతుందేమోనని తీవ్ర ఆవేదనకు గురవుతున్న రాజేశ్వరికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. కూతురు పెళ్లి చేయాలని దాచుకున్న బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన తెలిసిన ఆయన రాజేశ్వరి ఇంటికొచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించారు.

బంగారం ఇస్తానని హామీ ఇచ్చిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే

బంగారం ఇస్తానని హామీ ఇచ్చిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే

ఇక తన వంతు సాయంగా ఐదు తులాల బంగారాన్ని ఇస్తానని రాజేశ్వరికి హామీ ఇచ్చారు. పెళ్లికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తానని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట ఇచ్చారు. దీంతో ఆ కుటుంబం ప్రొద్దుటూరు ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపింది. కష్టపడి దాచుకున్న బంగారం పోయిందని, కూతురు పెళ్లి ఎలా చేయాలి అని ఆవేదన లో ఉన్న రాజేశ్వరికి ఎమ్మెల్యే ఇచ్చిన హామీతో కాస్త ఊరట దొరికినట్లయింది. ఇక పెళ్లి ఇంట్లో దొంగతనం జరిగిన ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

 ఎమ్మెల్యే ఆడపిల్ల పెళ్లి కోసం అండగా ఉంటానని చెప్పటంతో స్థానికంగా హర్షం

ఎమ్మెల్యే ఆడపిల్ల పెళ్లి కోసం అండగా ఉంటానని చెప్పటంతో స్థానికంగా హర్షం

అయితే చోరీ అయిన సొమ్ము తిరిగి దొరికే దాకా ఎదురు చూడకుండా, పెళ్లి ఆగిపోకుండా ఉండేలా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇవ్వడంతో అమ్మాయి కుటుంబం కాస్త రిలీఫ్ అయింది. రాజేశ్వరి కూతురు హారిక వివాహం కోసం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చూపించిన చొరవ ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశమైంది. చోరీ అయిన సొమ్ములు కూడా త్వరగా పట్టుకొని వేరే అప్పగించాలని ఎమ్మెల్యే పోలీసులకు ఈ వ్యవహారంపై సూచించడం, బాధిత కుటుంబానికి అండగా నిలవడంతో మా ఎమ్మెల్యే మంచివాడు అంటున్నారు స్థానికులు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+