ఏపీకి శుభవార్త.. స్థానికతపై కీలక నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీ!
హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే ఉద్యోగుల పిల్లల స్థానికత వ్యవహారం పరిష్కారమైంది. వారికి అదనంగా మరో రెండేళ్లు గడువు ఇచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అంగీకరించారు.
అమరావతి: హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే ఉద్యోగుల పిల్లల స్థానికత వ్యవహారం పరిష్కారమైంది. వారికి అదనంగా మరో రెండేళ్లు గడువు ఇచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అంగీకరించారు.
తొలుత ఈ స్థానికత గడువు రాష్ట్ర ఆవిర్భావ దినం 2014 జూన్ 2 నుంచి మూడేళ్లపాటు ఇచ్చారు. ఆ గడువు ఈ ఏడాది జూన్ 2తో ముగిసింది. అయితే వివిధ కారణాల రీత్యా చాలాతక్కువ మంది మాత్రమే స్థానికతకు దరఖాస్తు చేసుకున్నారు.

దీంతో స్థానికత గడువును మరో రెండేళ్లు పెంచాలని కోరుతూ సీఎం చంద్రబాబు ఈ ఏడాది మేలో ప్రధానమంత్రికి లేఖ రాశారు. విద్యా సంవత్సరం మధ్యలో కుటుంబాలను తరలించడం ఇష్టంలేని వారు.. హైదరాబాద్ స్థానికత కోల్పోతే ఉద్యోగావకాశాలు తగ్గుతాయని భావించిన వారు ఏపీ స్థానికతను కోరుకోలేదు.
కొన్ని ప్రైవేటు సంస్థలు, ఉద్యోగులు ఇప్పుడిప్పుడే నవ్యాంధ్రప్రదేశ్‌కు తరలివస్తున్నారు. మరోవైపు 9, 10 షెడ్యూళ్ల సంస్థల ఉద్యోగులు కూడా ఇంకా రాష్ట్రానికి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో స్థానికత గడువును పొడిగించాల్సిన అవసరం ఉందని సీఎం లేఖలో పేర్కొన్నారు.
ఉద్యోగులు మినహా ఇతరులకు స్థానికత మార్పుపై అవగాహన లేకపోవడం కూడా తక్కువ దరఖాస్తులకు కారణంగా భావిస్తున్నారు. అవగాహన లేక అవకాశం కోల్పోయిన వారికి మరో అవకాశం కల్పించేందుకు ఇది ఉపయోగపడనుంది.
మరో రెండేళ్లు గడువు పొడిగిస్తే న్యాయపరమైన చిక్కులు ఏమైనా వస్తాయా? అనే కోణంలో కేంద్ర అధికారులు అధ్యయనం చేశారు. కేంద్ర హోంశాఖ, న్యాయశాఖతోపాటు ప్రధాని కార్యాలయం కూడా ఆ లేఖను పరిశీలించాయి. దీంతో ప్రధాని నరేంద్రమోడీ ఆ లేఖపై ఆమోదముద్ర వేశారు.
స్థానికత గడువు పెంపుపై అధికారిక ఉత్తర్వులు వెలువడడానికి మరికొంత సమయం పడుతుంది. ప్రధాని కార్యాలయం నుంచి ఆ ఫైలు రాష్ట్రపతి వద్దకు వెళ్లాల్సి ఉంది. దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర తెలిపిన తర్వాత గడువు పెంపు అమల్లోకి వస్తుంది.
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్












Click it and Unblock the Notifications