ఎయిర్‌టెల్ వాడేవారికి అదిరే శుభవార్త
దేశీ దిగ్గజ టెలికం కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తోన్న ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు అదిరే శుభవార్త అందించింది. కొత్త రీచార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. రూ.99తో అన్ లిమిటెడ్ 5జీ డేటాను ఉపయోగించుకోవచ్చు. కానీ దీని వ్యాలిడిటీ కేవలం ఒక్కరోజే ఇచ్చింది కంపెనీ. అన్నింటికన్నా ప్రధానమైన విషయం ఏమిటంటే అన్‌లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్యాక్ గరిష్ఠ డేటా పరిమితి 30 జీబీ.
ఒక వేళ యూజర్ 30 జీబీ మొత్తాన్ని ఉపయోగించుకుంటే తర్వాత 64 కేబీపీఎస్ వేగానికి పడిపోతుంది. ఎయిర్ టెల్ బేసిక్ ప్లాన్ కలిగివుంటేనే రూ.99తో రీఛార్జి చేసుకోవడానికి వీలవుతుంది. వొడాఫోన్ ఐడియా కూడా తన వినియోగదారులకు ఇండిపెండెన్స్ డే ఆఫర్ ప్రకటించింది. ప్రీపెయిడ్ యూజర్లు రూ.199 లేదా అంతకంటే ఎక్కువ విలువ కలిగిన ప్లాన్స్ ఎంపిక చేసుకుంటే 50జీబీ వరకు డేటా అందిస్తోంది.

రిలయన్స్ జియో ఇటీవలే జియోబుక్ లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. రూ.16,499 ధరకే ల్యాప్‌టాప్ ను ఆవిష్కరించింది. జియోబుక్ అమ్మకాలు కూడా ప్రారంభమయ్యాయి. రిలయన్స్ డిజిటల్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్, అమెజాన్‌లో జియోబుక్ కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లో జియోబుక్ కొనేవారికి పలు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
జియో బుక్ లో 4జీ ఎల్‌టీఈ, డ్యూయల్-బ్యాండ్ వైఫై, 2.0GHz ఆక్టాకోర్ ప్రాసెసర్, 4GB LPDDR4 RAM, 64GB స్టోరేజ్ లాంటి ఫీచర్లతోపాటు ఎస్‌డీ కార్డ్ సాయంతో 256జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఇన్ఫినిటీ కీబోర్డ్, లార్జ్ మల్టీ జెశ్చర్ ట్రాక్‌ప్యాడ్, యూఎస్‌బీ, హెచ్‌డీఎంఐ పోర్ట్స్ లాంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.












Click it and Unblock the Notifications