ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు శుభవార్త
ఏపీలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలిలో డిప్యుటేషన్ పై పనిచేసేందుకు అవకాశం కల్పించారు. మొత్తం ఖాళీలు 34 ఉన్నాయి. వీటిని వెంటనే భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీచేసింది. జిల్లాపరిషత్తు, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వగా, తమకు కూడా అవకాశం కల్పించాలని పురపాలక శాఖకు సంబంధించిన పాఠశాలల్లో పనిచేసే ఉఫాధ్యాయులు కూడా విన్నవించుకోవడంతో వారికి కూడా అవకాశం కల్పించారు.
పంచాయితీరాజ్ శాఖలో కారుణ్య నియామకాలు
ఈ సంవత్సరం సెప్టెంబరు 28వ తేదీకి ఉపాధ్యాయులకు 15 సంవత్సరాల బోధనా అనుభవం ఉండాలి. అలాగే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందుకున్నవారికి, ఎంఫిల్, పీహెచ్ డీ చేసినివారికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఈనెల 25వ తేదీలోగా ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించాలి. ఈనెల 30వ తేదీలోగా వాటిని పరిశీలించి నవంబరు నాలుగు, ఐదు తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైనవారిని ఎంపిక చేస్తారు. అలాగే పంచాయితీరాజ్ శాఖలో కారుణ్య నియామకాలకు సంబంధించి ఆ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకొని, కారుణ్య నియామకాలు పూర్తిచేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

కారుణ్య నియామకాలు చేపట్టాలి
ఏపీలో నాలుగు సంవత్సరాల నుంచి కారుణ్య నియామకాలు పెండింగ్ లో ఉన్నాయి. కరోనా సమయంలో కొందరు, సహజ మరణంతో కొందరు కలిపి దాదాపు మూడువేల మందికిపై ఉపాధ్యాయులు మరణించారు. వారికి సంబంధించిన కారుణ్య నియామకాలు నిలిచిపోయాయి. ఆయా కుటుంబాల్లో అర్హులైన కుటుంబ సభ్యులకు ఒకేసారి పరిష్కారం చూపేవిధంగా ఉద్యోగాలివ్వాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరుతున్నారు. మధ్యంతర భృతి చెల్లించాలని, పన్నెండో పీఆర్సీ ప్రకారం వేతనాలుండాలని కోరుతున్నారు. విద్యార్థులు లేని పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ప్రభుత్వ పాఠశాలల్లో శాశ్వతంగా సర్దుబాటు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.












Click it and Unblock the Notifications