ఏపీకి శుభవార్త
రాష్ట్రంలో కొద్ది రోజుల నుంచి ఎండలు మండిపోతున్నాయి. దీనికితోడు ఉక్కపోత కూడా ఉండటంతో వర్షాకాలంలో ఈ వాతావరణం ఏమిట్రా బాబూ అంటూ ప్రజలు రోజులు నెట్టుకొస్తున్నారు. చెదురు మదురుగా అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నప్పటికీ భారీ వర్షాలు మాత్రం కురవడంలేదు. పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో గురువారం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో శుక్రవారం వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
కోస్తాంధ్రలోని గుంటూరులో 58.4 మిల్లీ మీటర్లు, శ్రీకాకుళం జిల్లా మందసలో 55.4, రణస్థలంలో 40.2, పార్వతీపురం మన్యం జిల్లా కొరాడలో 38.4, బాపట్లలో 35.9, గుంటూరు జిల్లా తెనాలిలో 31.2, విజయనగరం జిల్లా బొబ్బిలిలో 28.6, శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో 25.4, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 25, ఏలూరు జిల్లా కుక్కునూరులో 22 మిల్లీ మీటర్లు, తిరుపతి జిల్లా తడలో 50 మిల్లీ మీటర్లు, తిరుపతిలో 40.7, తిరుపతి జిల్లా సూళ్లూరు పేటలో 34.8, సత్యవేడులో 27.6 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.

బంగాళాఖాతంలో అల్పపీడనాలకు అనువైన వాతావరణం లేకపోవడంతో పాటు నైరుతి రుతుపవనాలు కూడా బలహీనపడ్డాయని, దీనివల్ల రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పశ్చిమ వాయువ్యం నుంచి గాలులు వీస్తుండటంతో పొడి వాతావరణం ఏర్పడింది.
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది రుతుపవనాలు బలహీనంగా మారాయి. కొన్ని జిల్లాల్లో ఆగస్టు నెలలో ఒక్కరోజు కూడా చినుకు పడలేదు. పగలు మూడు నుంచి ఆరు డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈనెల 18వ తేదీన ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.












Click it and Unblock the Notifications