ఏపీకి శుభవార్త.. ఆ నేషనల్ హైవే పనులు పరుగులు పెట్టిస్తున్న కేంద్రం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన చేపట్టిన నాటినుండి ఏపీలో జాతీయ రహదారుల విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. తమకు అధికారం కట్ట బెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం పలు అభివృద్ధి పనులతో చేయగలిగిందంతా చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ పైన కేంద్రం దృష్టి సారించింది అన్న విషయం తెలిసిందే.
ఆ నేషనల్ హైవే విస్తరణకు శరవేగంగా పనులు
రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల నేషనల్ హైవే విస్తరణతో పాటు, భారీగా జాతీయ రహదారుల నిర్మాణం చేస్తున్న కేంద్రం ఏపీలో ప్రగతిని పరుగులు పెట్టిస్తోంది. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో జాతీయ రహదారి విస్తరణకు సంబంధించి శరవేగంగా పనులు సాగుతున్నాయి. నంద్యాల జిల్లా చాగలమర్రి నుంచి ఉమ్మడి కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం వేంపల్లె వరకు 78.95 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి విస్తరణకు శరవేగంగా అడుగులు వేస్తోంది.

నేషనల్ హైవే 440లో విస్తరణా పనులలో వేగం
నేషనల్ హైవే 440లో విస్తరణా పనుల కోసం గత డిసెంబర్లో 1059 కోట్లతో టెండర్ ప్రక్రియ ముగియగా భూసేకరణ పనులు పూర్తి చేశారు. ఇక ఈ నెల 8వతేదీన భారత ప్రధాని మోడీ వర్చువల్ విధానంలో విశాఖపట్నం నుంచి ఈ పనులకు శంకుస్థాపన చేశారు. మైదుకూరు- ముదిరెడ్డిపల్లె వరకు 167-బీ పేరుతో కొత్తగా 13 కిలోమీటర్ల మేర రూ.135 కోట్లతో జాతీయ రహదారి నిర్మాణానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
జాతీయ రహదారి 440 విస్తరణ అందుకే
ఇక ఈ రోడ్డునే కాకుండా ప్రొద్టుటూరు మండలం గోపవరం పాత రోడ్డు మీదుగా కూడా 7 కిలోమీటర్ల వరకు 100 నుంచి 150 అడుగుల వరకు రెండు వరుసలతో హైవేను విస్తరిస్తారు. జాతీయ రహదారి 67 లో వాహన రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల జాతీయ రహదారి 440 విస్తరించి అందుబాటులోకి తెస్తే బాగుంటుందని భావిస్తున్న క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్ బెంగళూరుకు జర్నీ ఈజీ
ఇక ఈ జాతీయ రహదారి విస్తరణతో హైదరాబాద్ బెంగళూరు రాకపోకలకు ప్రయాణం సులభతరం అవుతుందని భావిస్తున్నారు ఇప్పటికే భూసేకరణ పనులు పూర్తిచేసిన క్రమంలో అభివృద్ధి పనులకు టెండర్లు అర్హత సాధించిన కాంట్రాక్టర్ తో వర్క్ అగ్రిమెంట్ కాగానే పనులను చేపడతామని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications