ఏపీలో ఆ రైతులకు శుభవార్త, ధరలపెంపు, ఖాతాల్లో డబ్బులు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాఫీ రైతులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన్యం ప్రాంతంలో సాగయ్యే కాఫీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అరకుకాఫీ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకతను సంతరించుకుంది. ముఖ్యంగా ఏపీలోని మన్యం ప్రాంతం కాఫీ సాగుకు అనుకూలంగా ఉండడంతో ఇక్కడ సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా పెరుగుతుంది. అయితే కాఫీగింజలకు తగినంత ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్న క్రమంలో కూటమి ప్రభుత్వం కాఫీ రైతులకు శుభవార్త చెప్పింది.
1.50 లక్షల ఎకరాలలో కాఫీ సాగు
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డివిజన్లో దాదాపు 1.50 లక్షల ఎకరాలలో కాఫీ సాగు చేస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇక్కడ రైతులు ఏటా సుమారు 17 వేల మెట్రిక్ టన్నుల కాఫీ గింజలను విక్రయిస్తున్నారు. కాఫీ గింజలు కొనుగోలులో రైతులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తమ పంటకు సరైన ధర లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాఫీగింజల ధరలను పెంచుతూ శుభవార్త
ఈ క్రమంలో కూటమి ప్రభుత్వ 2025 - 26ఆర్థిక సంవత్సరానికి కాఫీగింజల ధరలను పెంచుతున్నట్లు శుభవార్త చెప్పింది. ఇక గిరిజన సహకార సంస్థ ఐటీడీఏ ఇదే విషయాన్ని వెల్లడించింది. విశాఖలో జరిగిన అపెక్స్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్న ఐటిడిఏ అంతర్జాతీయ కాఫీ ధరలను పరిగణనలోకి తీసుకొని ఈ పెంపును చేపట్టినట్టు పేర్కొంది. దీంతో కాఫీ రకాన్ని బట్టి కిలోకు పది రూపాయల నుంచి 50రూపాయల వరకు ధర పెరిగింది.
కాఫీ గింజల రకాల పెరిగిన ధరలు ఇలా
అరెబికా పాచ్మెంట్ రకంపై కిలోకు 450 రూపాయలు ధర పెంచారు. అలాగే అరెబికా చెర్రీ రకానికి 270 రూపాయలు, రోబస్టా చెర్రీ రకానికి 170 రూపాయలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. కాఫీ సేకరణ కోసం ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాలకు తమ సిబ్బంది చేరుకుంటారని రైతుల ఇంటి వద్ద ఎలక్ట్రానిక్ కాంటాక్ట్ తో అత్యంతమైన దుఖంతో పంటను సేకరిస్తామని కూడా అధికారులు చెబుతున్నారు.
కాఫీ గింజలు కొన్న 24 గంటల్లోనే డబ్బులు జమ
కాఫీ కొనుగోలు చేసిన వెంటనే రైతుల బ్యాంకు ఖాతాలలో 24 గంటల్లోగా డబ్బులు జమ చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన ధర కంటే తక్కువకు విక్రయించి రైతులు మోసపోవకూడదని రైతులకు విజ్ఞప్తి చేశారు. పెంచిన ధరలపైన గిరిజనులకు అవగాహన కల్పించాలని కూడా అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications