భక్తులకు గుడ్‌న్యూస్.. ఈ నెల 16 వరలక్ష్మి వ్రతం సందర్భంగా కానుకలు, టిక్కెట్లు..
తిరుమల స్వామివారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఈ నెల 16వ తేదిన వరలక్ష్మి సందర్భంగా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇక, ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఆలయ అధికారులు కానుకలు అందించనున్నారు. ఆగష్టు 16వ తేదీ శుక్రవారం వరలక్ష్ష్మీ వ్రతం వైభవంగా జరపనున్నారు. ఈ వ్రతానికి సంబంధించిన టికెట్లను కూడా ఆలయ అధికారులు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న దంపతులకు పలు కానుకలను కూడా అధికారులు అందజేయనున్నారు. వ్రతం నిర్వహణ కోసం అధికారులు పలు ఏర్పాట్లు చేయనున్నారు. వ్రతంలో భాగంగా తెల్లవారుజామున మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేక కార్యక్రమం ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలోని ఆస్థాన మండపంలో వరలక్ష్మీ వ్రతం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వ్రతంలో పాల్గొన్న మహిళలకు ఉత్తరీయం, రవికె, లడ్డూ, వడ బహుమతిగా అందజేయనున్నారు. ఇందుకు సంబంధించిన వర్చువల్ టికెట్లు కోటా కోసం ఆన్‌లైన్ బుకింగ్ కూడా జరగనుంది. సాయంత్రం 6 గంటలకు అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగనున్నారు.

పలు సేవా కార్యక్రమాలు రద్దు..
వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారి ఆలయంలో పలు సేవలను రద్దు చేశారు. ఆర్జితసేవలైన అభిషేకం, దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, కుంకుమార్చన, వేదాశీర్వచనం, బ్రేక్ దర్శనం, సహస్రదీపాలంకరణ సేవలను ఆలయ అధికారులు రద్దు చేసినట్లు తెలిపారు. తిరుచానూరు ఆలయంలో వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనే భక్తులకు విశేషమైన కానుకలతో పాటు టిక్కెట్లు కూడా అందనున్నాయి. ఇక, వరలక్ష్మి వ్రతం చేసే వారు ఆ రోజు ఉదయాన్నే మంగళ స్నానం చేసి, నూతన వస్త్రాలు ధరించాల్సి ఉంటుంది.
అనంతరం ఆలయంలో అర్చకులు ఏర్పాటుచేసిన మంటపంలో కొలువైన వరలక్ష్మీ దేవి దర్శనం చేసుకోవాలి. అర్చకులు మంటపంలో వేసిన ముగ్గులలో కమలాన్ని ఏర్పాటు చేశారు. దాని మధ్యలో కలశాన్ని ఉంచుతారు. ఆ కలశంపై నారికేళ ఫలాన్ని ఉంచుతారు. దానికి చెవులు, కన్నులు, ముక్కు ఏర్పాటు చేసి ఆభరణాలతో అలంకరిస్తారు. ఆ రోజంతా లక్ష్మీమాతను పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం అర్చకులు ఆవాహనం చేసి షోడశోపచార పూజ కార్యక్రమాలను నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications