ఏపీ ప్రయాణికులకు ఊరట: ఏసీ బస్సు ఛార్జీలు తగ్గింపు, ఎంతంటే.?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం కాస్త ఊరట కలిగే వార్తను అందించింది. ఏసీ బస్సు ఛార్జీలో20 శాతం వరకు తగ్గిస్తూ ఏపీఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. ఛార్జీల తగ్గింపు సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఏయే రూట్లలో ఎంతమేర బస్సు ఛార్జీ తగ్గించాలనే నిర్ణయాధికారాన్ని ఆర్టీసీ రీజనల్ మేనేజర్(ఆర్ఎంలకు) లకు అప్పగించింది. దీంతో ఛార్జీల తగ్గింపుపై జిల్లాల ఆర్టీసీ అధికారులు ప్రకటనలు జారీ చేస్తున్నారు.

విజయవాడ-హైదరాబాద్ మార్గంలో ఎక్కువగా తిరిగే అమరావతి, గరుడ, వెన్నెల ఏసీ బస్సుల్లో టికెట్ ధరలో 10 శాతం మేర తగ్గించినట్లు అధికారులు తెలిపారు. పండగల సమయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రయాణికులు స్వాగతిస్తున్నారు.
బస్సుల్లో తగ్గించిన చార్జీలు ఇలా..
హైదరాబాద్-విజయవాడ ఏసీ బస్సుల్లో 10 శాతం తగ్గింపు
అమరావతి, గరుడ, వెన్నెల బస్సు చార్జీల్లో 10 శాతం తగ్గింపు
విజయవాడ-విశాఖ డాల్ఫిన్ క్రూజ్ బస్సుల్లో 20 శాతం తగ్గింపు
విజయవాడ నుంచి చెన్నై, బెంగళూరు బస్సుల్లో 20 శాతం తగ్గింపు.












Click it and Unblock the Notifications