రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. వారికి రైలు టికెట్ల ధరలపై భారీ తగ్గింపు!

భారతీయ రైల్వేల ద్వారా ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులు తాము వెళ్లాలనుకున్న గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. రైల్వే మన దేశ ఆర్థిక ప్రగతికి, సామాజిక పురోగతికి ఎంతగానో దోహదం చేస్తుంది. రైళ్లలో సుఖవంతమైన సురక్షితమైన ప్రయాణ సౌకర్యం కలుగుతుంది. దీని కారణంగానే చాలామంది రోడ్డు రవాణా కంటే రైళ్లలో ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపిస్తారు. రైళ్ళు రోడ్డు రవాణా కంటే త్వరితంగా గమ్య స్థానాలకు చేరుస్తాయి.

రోగులకు రైల్వే రాయితీలు
ఈ క్రమంలో రైల్వే ప్రయాణికులు నిత్యం లక్షల సంఖ్యలో రైళ్ళ ద్వారా ప్రయాణాలు సాగిస్తున్నారు. భారతీయ రైల్వే ప్రయాణించే అనేక వర్గాల ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను అందిస్తుంది. ఇప్పటికే సీనియర్ సిటిజన్స్ కు మహిళలకు 50%, పురుషులకు 40 శాతం రాయితీ కల్పించి సగం టికెట్ ధరనే తీసుకుంటుండగా అనారోగ్యంతో బాధపడే ప్రయాణికుల కోసం కూడా భారతీయ రైల్వే వివిధ మినహాయింపులను ఇచ్చింది.

Good news for railway passengers special concession on train tickets for cancer heart and kidney patients

క్యాన్సర్ రోగులకు రాయితీ
రైళ్ళలో ప్రయాణం చేసే రోగులకు రాయితీలు ఉన్నాయన్న విషయం చాలా మందికి తెలీదు. మరి ఆ మినహాయింపుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం. రైళ్లలో ప్రయాణం చేసే క్యాన్సర్ రోగులకు 75% డిస్కౌంట్ ను రైల్వే అందిస్తుంది. సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్, మరియు ఏసీ చైర్ కార్లలో ప్రయాణం చేసే వారికి 75% డిస్కౌంట్ ఇస్తుంది. స్లీపర్, థర్డ్ ఏసీ ప్రయాణంలో 100% తగ్గింపు లభిస్తుంది.

ఈ రోగాలతో బాధ పదేవారికీ మినహాయింపు
ఫస్ట్ ఏసీ మరియు సెకండ్ ఏసీ కోచ్ లో ప్రయాణం చేసే వారికి 50 శాతం మినహాయింపు ఇస్తుంది. ఎయిడ్స్ రోగులకు సెకండ్ క్లాస్ లో 50% తగ్గింపు ఇస్తుంది. టీబీ మరియు లూపాస్ వల్గారిస్ తో బాధపడే వారికి సెకండ్ క్లాస్ స్లీపర్ క్లాస్ మరియు ఫస్ట్ క్లాస్ లో 75% తగ్గింపు ఇస్తుంది.

హార్ట్, కిడ్నీ, తలసేమియా పేషెంట్ లకూ రాయితీ
తల సేమియా పేషెంట్లకు, హార్ట్ పేషెంట్లకు, కిడ్నీ పేషెంట్లకు ఏసీ క్లాస్, ఏ సి థర్డ్ , ఏ సి చైర్ కార్లలో ప్రయాణం పైన 75% మినహాయింపు ఇస్తుంది. అంతేకాదు ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీలలో 50% తగ్గింపు ఇస్తుంది. హేం ఫిలియా పేషెంట్లకు సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్, ఏసి చైర్ కార్లలో 75% రాయితీని ఇస్తుంది.

సైకిల్ సెల్ ఎనీమియా, ఓస్టోమి పేషెంట్ లకు మినహాయింపు
సికిల్ సెల్ ఎనీమియా తో బాధపడే వారికి స్లీపర్ క్లాస్, ఏసీ చైర్ కార్, ఏసీ థర్డ్ టైర్ ,ఏసీ టూ టైర్ క్లాసులలో 50 శాతం రాయితీ ఇస్తుంది. ఓస్టోమి పేషంట్లకు ఎం ఎస్ టి, క్యూ ఎస్టి పై 50% తగ్గింపునిస్తుంది. అయితే చాలా మంది రోగులకు ఈ విషయం తెలియదు, అందుకే అందరూ ఈ విషయం తెలుసుకుని అవసరమైన వారికి చెప్తే చాలా మంది రోగులకు రైల్వే అందిస్తున్న ఈ రాయితీలు కాస్త వారికి ఆర్ధిక ఉపశమనం కలిగిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+