TTD ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్
తిరుమల తిరుపతి దేవస్థానం తన ఉద్యోగులకు శుభవార్తను వినిపించింది. ఈనెల 18వ తేదీన వారికి ఇంటిస్థలాలను పంపిణీ చేయబోతున్నారు. ఈమేరకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో ఉద్యోగులకు ఇచ్చిన ఇంటి స్థలాలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలివ్వాలని అభ్యర్థించామని, ఆ తర్వాత జరిగిన కొన్ని కీలక పరిణామాలవల్ల అది సాధ్యపడలేదన్నారు. తాజాగా ఆయన తనయుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో తిరిగి సాధ్యమైనందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.

ముఖ్యమంత్రితోపాటు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు ఉద్యోగులతో స్నేహపూర్వక వాతావరణాన్ని కోరుకుంటున్నారన్నారు. జగన్ తో మాట్లాడి ఉద్యోగస్తుల ఇంటిస్థలాల కోసం మరో 100 ఎకరాలను మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈనెల 18న కొంతమంది ఉద్యోగులకైనా స్థలాలను పంపిణీ చేస్తామన్నారు. ఈనెల 10వ తేదీన భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయనకు ముందు ఉన్న వైవీ సుబ్బారెడ్డి చైర్మన్ గా రెండు పర్యాయాలు, నాలుగు సంవత్సరాలపాటు వ్యవహరించారు. వైవీ పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం భూమనను నియమించింది.
తిరుమల నడక దారిలో చిరుతల సంచారంతో టీటీడీ అప్రమత్తమైంది. తిరుమల శ్రీవారి దర్శనార్థం కాలినడకన వచ్చే భక్తులకు ఎటువంటి అపాయం కలగకుండా చూడాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు. కాలినడక మార్గాలు, ఘాట్‌లలో యాత్రికుల భద్రత దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో టీటీడీ ఈవో, ఎస్పీ, అటవీ శాఖ, జిల్లా జాయింట్ కలెక్టర్ ఇతర అధికారులు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.












Click it and Unblock the Notifications