గుంటూరు, విజయవాడకు గుడ్ న్యూస్
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ సందడి ప్రారంభమైంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి ఏపీలోని సొంత ఊళ్లకు జనాలు తరలివెళుతున్నారు. రైళ్లల్లో అస్సలు ఖాళీలేదు. బస్సులు పూర్తిగా నిండిపోయాయి. సొంత కార్లు ఉన్నవారు వాటిల్లో వెళుతున్నప్పటికీ విజయవాడ-హైదరాబాద్ మధ్య ఉన్న టోల్ గేట్ దగ్గర ఎంతో సమయం పడుతుండటంతో గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. రైళ్లల్లో అయితే నెలరోజుల వరకు వెయిటింగ్ లిస్టు దర్శనమిస్తోంది.
రైళ్లల్లో రద్దీని నివారించేందుకు అధికారులు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. వీటిలో భాగంగా హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం రోడ్డు వరకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. 12వ తేదీ రాత్రి 9.00 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరి 13వ తేదీ ఉదయం 8.28 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడినుంచి 8.30 గంటలకు బయలుదేరి11.45 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది.

ఇదే రైలు తిరుగు ప్రయాణంలో 13వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ లో బయలుదేరి రాత్రి 8.18 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. 8.20 గంటలకు అక్కడినుంచి బయలుదేరి తర్వాతరోజు ఉదయం 9.15 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. దారి మధ్యలో ఇది విజయనగరం, విశాఖపట్నం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నల్గొండ స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తాజాగా విజయవాడ-విశాఖపట్నం మధ్య తిరుగుతున్న డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్ ప్రెస్ ను గుంటూరు వరకు పొడిగించారు. ఇకనుంచి ఈ రైలు గుంటూరు నుంచి విశాఖపట్నం మధ్య నడవనుంది.












Click it and Unblock the Notifications