ఏపీలో నిరుద్యోగులకు, విద్యార్థులకు ఏకకాలంలో మామూలు శుభవార్త కాదిది!
ఏపీలో విద్యా వ్యవస్థకు పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు యూనివర్సిటీలను ఈ ఏడాది నుండి ప్రారంభిస్తుంది. ఈ విద్యా సంవత్సరం నుండి ఆంధ్రప్రదేశ్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాలలో ప్రవేశాలను ప్రారంభించనున్నారు.
ఈ విద్యా సంవత్సరం రెండు యూనివర్సిటీలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాల సుసంపన్నం చేయడానికి ప్రణాళికబద్ధంగా పనిచేస్తుంది. ఇందులో భాగంగా ముఖ్యంగా ఏపీలో విద్యా వ్యవస్థకు పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు యూనివర్సిటీలను ఈ ఏడాది నుండి ప్రారంభిస్తుంది. ఈ విద్యా సంవత్సరం నుండి ఆంధ్రప్రదేశ్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాలలో ప్రవేశాలను ప్రారంభించనున్నారు.

ఏపీలో సేవలు నిలిపివేసిన ఆ యూనివర్సిటీల ప్రవేశాలకు కసరత్తు
తెలుగు యూనివర్సిటీకి మునిరత్నం నాయుడు, అంబేద్కర్ యూనివర్సిటీకి ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ విజయ భాస్కర్ లను ప్రత్యేక అధికారులుగా నియమించే ఫైలుపైన ప్రభుత్వం పరిశీలనలో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఏర్పడిన తెలుగు విశ్వవిద్యాలయం, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పదేళ్లు పూర్తి కావడంతో ఏపీలో తమ సేవలను నిలిపి వేశాయి.
రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయం
కొత్తగా తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాజమహేంద్రవరంలో, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని ఏలూరు జిల్లాలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేసి ఈ ఏడాది నుండి ప్రవేశాలను నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తన కార్యకలాపాలను శ్రీశైలం, కూచిపూడి, రాజమహేంద్రవరంలో విస్తరించి ఉంది.
తెలుగు యూనివర్సిటీ ఏర్పాటుకు 50 కోట్లు
గత సంవత్సరం ప్రవేశాలు లేకపోవడంతో ప్రస్తుత ఇప్పుడు రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మాత్రమే యూనివర్సిటీలో ఉన్నారు. ఇక రాజమహేంద్రవరంలో ఆధునీకరించిన భవనాలను విశ్వవిద్యాలయ కార్యకలాపాలను ప్రారంభించనున్నారు. ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడానికి సుమారు 50 కోట్ల అవసరమవుతాయని అధికారులు ప్రతిపాదనలు చేస్తారు.
తెలుగు యూనివర్సిటీలో 72 బోధన, 115 బోధనేతర పోస్టులు
హైదరాబాదులోని తెలుగు విశ్వవిద్యాలయం ప్రస్తుతం 22 విభాగాలు 40 కోర్సులతో ఉంది. వీటిని ఇక్కడ ప్రారంభించడానికి 72 బోధనా, 115 బోధనేతర పోస్టులు అవసరమవుతాయని, మొదట ఎక్కువ డిమాండ్ ఉన్న కోర్సులను ప్రారంభించాలని చూస్తున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ రాజమహేంద్రవరంలో కార్యకలాపాలు నిర్వహించడానికి అక్కడి భవనాలను ఆధునీకరిస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రారంభ బడ్జెట్ 20 కోట్లు కాగా, జీతభత్యాలకు, మౌలిక సదుపాయాల కల్పనకు మరో 30 కోట్ల అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు.












Click it and Unblock the Notifications