మైగాడ్.. ఏపీలో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఏమిటో తెలుసా?

నైరుతి రుతుపవనాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రమక్రమంగా విస్తరిస్తున్నారు. వీటి ప్రభావంవల్ల రానున్న ఐదురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదంటే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ద్రోణి ఏర్పడటంతో వచ్చే ఐదురోజులు విస్తారంగా వానలు కురవనున్నాయని వెల్లడించారు. ఈ ద్రోణి రాయలసీమ నుండి పశ్చిమమధ్య బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమలో తేలికపాటి జల్లులు పడతాయి.

విస్తారంగా వానలు
అల్లూరి, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 5 రోజుల్లో ద్రోణి ప్రభావంవల్ల మోస్తరు వర్షాలు ఐదురోజులపాటు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. అలాగే తెలంగాణలో వానలు విస్తారంగా కురుస్తాయని, ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తగా ఉండాలని, పొలాల్లో పనిచేస్తున్న రైతులు, రైతు కూలీలు, గొర్రెల కాపరులు, గేదెల కాపరులు చెట్లు, స్తంభాలు, టవర్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని సూచిస్తున్నారు.

good news next two days heavy rains in ap

ఎండ తీవ్రత కూడా ఎక్కువే
దేశంలోని అనేక రాష్ట్రాలను నైరుతి రుతుపవనాలు పలకరిస్తున్నాయి. రాబోయే రెండు రోజుల్లో కర్ణాటక, ఒడిసా, కోస్తాంధ్ర, తెలంగాణ, మహారాష్ట్రల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉన్నప్పటికీ మధ్యాహ్న సమయంలో భారీ వర్షాలకు అవకాశం ఉంది. తెలంగానలో పగటివేళ 30 నుంచి 34 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలో మాత్రం 32 డిగ్రీల నుంచి 38 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. తీర ప్రాంతాల్లో వేడి ఎక్కువగా ఉంటోంది. నిన్నటి నుంచి రుతుపవనాలు చురుకుదనాన్ని సంతరించుకున్నాయని, దీనివల్ల కోస్తాతోపాటు ఒడిసా, వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు కూడా ఇవి విస్తరించాయి. రాబోయే రెండురోజుల నుంచి రాష్ట్రంలో విస్తారంగా వానలు కురవనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+