తిరుపతి: స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా..
శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. అంకురార్పణం సందర్భంగా స్వామివారిని తెల్లవారుజామున సుప్రభాతంతో మేల్కొలిపి కొలువు, పంచాంగ శ్రవణం,
శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. అంకురార్పణం సందర్భంగా స్వామివారిని తెల్లవారుజామున సుప్రభాతంతో మేల్కొలిపి కొలువు, పంచాంగ శ్రవణం, మూల వర్లకు అర్చకులు అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6.00 గంటల నుంచి 8.00 గంటల వరకు పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం జరిగాయి. అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం జరిగింది.

తిరుచ్చి ఉత్సవం
ఉదయం 6.30 గంటల నుంచి 8.15 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. ఉదయం 8.40 గంటల నుంచి 9.00 గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సాయంత్రం 5.00 గంటల నుంచి 6.00 గంటల వరకు ఊంజల్ సేవ, రాత్రి 7.00 గంటల నుంచి 8.00 గంటలకు స్వామివారికి పెద్దశేష వాహనసేవ జరగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 8.00 గంటల నుంచి 9.00 గంటల వరకు, తిరిగి రాత్రి 7.00 గంటల నుంచి 8.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. ఆలయంలో అన్ని రకాల ఆర్జితసేవలను బ్రహ్మోత్సవాల కారణంగా రద్దుచేసింది.

19న చక్రస్నానం
వాహన సేవల వివరాలు ఇలా ఉన్నాయి. 11వ తేదీన ధ్వజారోహణం.. పెద్దశేష వాహనం, 12వ తేదీన చిన్న శేష వాహనం హంస వాహనం, 13వ తేదీన సింహ వాహనం ముత్యపు పందిరి వాహనం, 14వ తేదీన కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం, 15వ తేదీన పల్లకి ఉత్సవం(మోహినీ అవతారం) గరుడ వాహనం, 16వ తేదీన
హనుమంత వాహనం స్వర్ణరథం, గజ వాహనం, 17వ తేదీన సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం, 18వ తేదీన రథోత్సవం అశ్వవాహనం, 19వ తేదీన చక్రస్నానం ధ్వజావరోహణం ఉంటాయి.

ప్రతిరోజు హరికథలు
అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం హిందూధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతి రోజు సంగీత కచేరీలు, హరికథలు ఉంటాయి. శుక్రవారం ఒక్కరోజే శ్రీవారిని 57,702 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.43 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 13న ఉదయం 9.00 గంటకు ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లను విడుదల చేయనున్నారు.












Click it and Unblock the Notifications