ఏపీ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్-సలహాదారు సంకేతం !

ఏపీలో గత నాలుగున్నరేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనపై ఉద్యోగుల్లో ఎక్కడో మూల అసంతృప్తి ఉందన్న వార్తల నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికల వేళ ఒక్కొక్కటిగా వారికి వరాలు ప్రకటిస్తోంది. ముఖ్యంగా సీపీఎస్ రద్దు విషయంలో అసంతృప్తిగా ఉన్న ఉద్యోగులకు గ్యారంటీ పెన్షన్ స్కీమ్ రూపంలో ప్రత్యామ్నాయం చూపించిన ప్రభుత్వం... పీఆర్సీ, డీఏ బకాయిల చెల్లింపు విషయంలో ఉన్న అసంతృప్తిని తొలగించేందుకు సిద్ధమవుతోంది.

ఇప్పటికే ఉద్యోగులకు చెల్లించాల్సిన పీఆర్సీ, డీఏ, ఇతర బకాయిల చెల్లింపు త్వరలో చేపడతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీని మేరకు నవంబర్ లోనే ఈ బకాయిలు చెల్లించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల వ్యవహారాల సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి తాజాగా ఓ సంకేతం ఇచ్చారు. ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన పీఆర్సీ, డీఏ, ఇతర బకాయిల్ని నవంబర్ లోగా చెల్లిస్తుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

good news to ap employees as ys jagan to clear prc, da dues by this november

ఉద్యోగుల సమస్యల్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లనప్పుడు ఆయన సానుకూలంగా స్పందిస్తున్నారని సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం దసరాకు ముందే ఓ డీఏ బకాయి చెల్లించారని గుర్తుచేశాారు. అలాగే సీపీఎస్ రద్దు చేసి గ్యారంటీ పెన్షన్ స్కీమ్ తీసుకురావడం ఉద్యోగులకు మేలు చేస్తోందన్నారు. అటు 12వ పీఆర్సీ కూడా తమ పని ప్రారంభించిందన్నారు.

ఎన్నికల వేళ ఉద్యోగుల్లో అసంతృప్తి తొలగించేందుకు ప్రభుత్వం పలు విధాలుగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే చేపట్టిన పలు చర్యలతో పాటు పీఆర్సీ అమలు వంటి నిర్ణయాలు కూడా తీసుకుంటుందని ఉద్యోగులు ఆశాభావంగా ఉన్నారు. అదే జరిగితే వైసీపీకి ఉద్యోగ వర్గాల మద్దతు పూర్తి స్ధాయిలో లభించడం ఖాయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+