డ్వాక్రా మహిళలకు శుభవార్త.. రెండురోజుల్లో వారి ఖాతాల్లోకి రూ.8 లక్షలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళలకు మరో శుభవార్త చెప్పింది. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వం డ్వాక్రా సంఘాల మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే డ్వాక్రా సంఘాల మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడానికి, స్వయం ఉపాధి కల్పించడానికి సబ్సిడీ కార్యక్రమాలతో చేయూతనివ్వనుంది.
ఒక్కో మహిళకు లక్ష నుంచి ఎనిమిది లక్షల రూపాయలు
రెండు నూతన పథకాలను ప్రారంభించి మహిళల కోసం అమలు చేయాలన్న ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఇక ఈ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలలోని ఒక్కో మహిళకు లక్ష నుంచి ఎనిమిది లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. మహిళా స్వయం సహాయక సంఘాలకు తోడ్పాటును అందించాలన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం స్త్రీ నిధి పథకం కింద మరో రెండు పథకాలను ప్రవేశపెడుతుంది.

రెండు పథకాలను అందించటం కోసం రెడీ అయిన ఏపీ ప్రభుత్వం
ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, కళ్యాణ లక్ష్మీ ద్వారా డ్వాక్రా గ్రూపు సభ్యుల పిల్లల ఉన్నత విద్య, వారి వివాహాల కోసం ఆర్థికంగా చేయూతనిస్తుంది. పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం కోసం ప్రభుత్వం ఈ రెండు పథకాలను అందించడానికి రెడీ అయింది. మరో రెండు రోజుల్లో ఈ పథకాల ద్వారా మహిళల ఖాతాలలో డబ్బులు జమ కానున్నాయి.
రెండు రోజుల్లో మహిళల ఖాతాల్లోకి డబ్బులు
స్త్రీనిధి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళల జీవనోపాధికి ఎనిమిది లక్షల రూపాయల వరకు, కుటుంబ ఖర్చులకు ఒక లక్ష రూపాయల వరకు రుణాలను పొందవచ్చు. ఈ రుణాలు నేరుగా 48గంటల్లోనే మహిళల బ్యాంకు ఖాతాలలో జమవుతాయి. ఈ రుణాలు తీసుకున్న తర్వాత రుణ గ్రహీత మరణిస్తే, ఆ కుటుంబం పైన భారం పడకుండా స్త్రీనిధి సురక్ష యోజన కింద రుణాన్ని రద్దు చేసే వెసులుబాటు కూడా ఉంది.
గ్రేడ్ లుగా వర్గీకరించి లోన్లు
అయితే స్వయం సహాయక సంఘాల మహిళల పనితీరును బట్టి, ఆర్థికంగా వారి బలోపేతమైన విధానాన్ని బట్టి వారిని ఏ,బి,సి,డి గ్రేడ్లుగా వర్గీకరించి రుణాలను అందిస్తున్నారు. ఏ గ్రేడ్ సంఘానికి కోటి రూపాయల వరకు, బి గ్రేడ్ సంఘానికి 90 లక్షల రూపాయలు, సీ గ్రేడ్ సంఘానికి 80 లక్షల రూపాయలు, డి గ్రేడ్ సంఘానికి 70 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయాన్ని కల్పిస్తారు.
మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వ నిర్ణయం
పిల్లల ఉన్నత విద్య, వివాహాలు వంటి ఖర్చులకు అధిక వడ్డీ అప్పులు తగ్గించడానికి ఈ సౌకర్యం వీరికి ఎంతగానో తోడ్పడుతుంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం, వారి కుటుంబాల ఉన్నతికి పిల్లల చదువులకు, పెళ్ళిళ్లకు దోహదం చేస్తుంది. మహిళలు ఆర్థిక ప్రగతితో, గౌరవంగా తలెత్తుకు నిలిచేలా చేస్తుంది.












Click it and Unblock the Notifications