రైల్వే గుడ్ న్యూస్.. ఏపీకి వివేక్ ఎక్స్ ప్రెస్
ఏపీ రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్తను వినిపించింది. డిబ్రూఘర్ - కన్యాకుమారి - డిబ్రూఘర్ వివేక్ ఎక్స్‌ప్రెస్‌ను వారానికి ఐదు రోజులు నడుపుతున్నారు. ఇప్పటివరకు వారానికి నాలుగు రోజులే నడుస్తోంది. డిబ్రూఘర్-కన్యాకుమారి (22504) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 22 నుంచి మంగళ, గురు, శుక్ర, శని, ఆదివారాల్లో.. కన్యాకుమారి-డిబ్రూఘర్ (22503) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 26 నుంచి సోమ, మంగళ, బుధ, గురు, శనివారాల్లో రాకపోకలు సాగించనున్నాయి. రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస స్టేషన్లలో ఆగుతుంది.
దేశంలోనే అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే రైలు వివేక్ ఎక్స్ ప్రెస్. దీన్ని వారానికి ఐదురోజులు అందుబాటులోకి తీసుకురావడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా ప్రయాణానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే విశాఖపట్నం-తిరుపతి (08583) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలు సమయాన్ని కూడా రీషెడ్యూల్ చేశారు. సోమవారం రాత్రి 7.10 గంటలకు బదులుగా రాత్రి 10.10 గంటలకు బయలుదేరనుంది.

విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ రైలుకు అదనంగా మరో వందే భారత్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మొదటి వందేభారత్ కు ఆక్యుపెన్సీ బాగుండటంతో రెండోదాన్ని అందుబాటులోకి తెచ్చారు. వాస్తవానికి నల్గొండ, నడికుడి మార్గంలో నడుపుదామనుకున్నప్పటికీ అది సింగిల్ ట్రాక్ కావడంతో దాన్నికూడా వరంగల్ మీదగా నడుపుతున్నారు. విశాఖపట్నం నుంచి పూరీకి కూడా వందేభారత్ రైలు నడుస్తున్న సంగతి తెలిసిందే. విజయవాడ నుంచి చెన్నైకి, కాచిగూడ నుంచి బెంగళూరుకు, సికింద్రాబాద్ నుంచి తిరుపతికి కూడా వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి.












Click it and Unblock the Notifications