కావలి వద్ద పట్టాలు తప్పిన రైలు, రెండు బోగీలకు ప్రమాదం..!!
సంక్రాంతి పండుగ వేళ పెను ప్రమాదం తప్పింది. తిరుపతి మార్గంలో రైలు పట్టాలు తప్పింది. మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ట్రాక్ స్వల్పంగా దెబ్బ తింది. రైల్వే అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఈ మార్గంలో ప్రయాణించే పలు ప్రధాన రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఎటువంటి నష్టం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. రైళ్ల రాకపోకలను యథావిధిగా కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.
పండుగ వేళ ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లా కావలి ముసునూరు ప్రాంతంలో ట్యాంకర్లతో వెళ్తున్న గూడ్స్ రైలుపట్టాలు తప్పింది. విశాఖ నుంచి తిరుపతి వెళ్తుండగా ప్రమాదం ఈ ప్రమాదం జరిగింది. తిరుపతి వెళ్తున్న ఈ గూడ్స్ ట్రైన్ సరిగ్గా కావలి రైల్వేస్టేషన్ సమీపంలోకి రాగానే ట్రైన్ పట్టాలు తప్పింది. దీంతో ట్రైన్‌లోని రెండు వ్యాగన్‌లు పట్టాల నుంచి పక్కకు పడిపోయాయి. గమనించిన లోకోపైలట్ వెంటనే ట్రైన్ ఆపేసి.. రైల్వే సిబ్బంది, అధికారులకు సమాచారం ఇచ్చాడు. హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో ట్రాక్ దెబ్బ తింది. దీంతో.. ట్రాక్ పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని.. లోకో పైలట్ కూడా సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్లకు అంతరాయం కలిగినట్టు అధికారులు తెలిపారు. ఘటనా స్థలికి డివిజన్ రైల్వే అధికారులు చేరుకొని రైళ్ల పునరుద్దరణ పనులను పర్య వేక్షిస్తున్నారు. విజయవాడ - చెన్నై మార్గంలో నడుస్తున్న కొన్ని రైళ్లకు అంతరాయం కలిగింది. అయితే, స్టేషన్ సమీపంలోనే జరగటంతో అన్ని రైళ్లను తిరిగి యథావిధిగా కొనసాగిస్తున్నట్లుగా అధికారులు వివరించారు. మధ్యాహ్నం లోగా ట్రాక్ పునరుద్దరించి అన్ని రైళ్ల రాకపోకలను తిరిగి ఆ ట్రాక్ మీదుగా వెళ్లే విధంగా ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. అయితే, గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటన పైన అధికారులు విచారణ చేస్తున్నారు. సాంకేతిక సమస్యతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications