విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యూఎస్‌లో లోకేష్: ఏపీకి గూగుల్ ఎక్స్ కార్యాలయం, ప్రత్యేకత ఇదే

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఏపీకి గూగుల్ ఎక్స్ కార్యాలయం : ఫైబర్‌ కేబుల్‌ లేకుండానే మొబైల్‌ డేటా, వైఫై

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మక గూగుల్‌ ఎక్స్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ తరలిరానుంది. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలోని గూగుల్‌ ఎక్స్‌ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, గూగుల్‌ ఎక్స్‌ సంస్థ మధ్య ఈ మేరకు కీలక ఒప్పందం కుదిరింది.

ఇప్పటివరకూ అమెరికాలో తప్ప ఏ ఇతర దేశంలోనూ కార్యకలాపాలు సాగించలేదు గూగుల్‌ ఎక్స్‌. అయితే, తాజా కుదిరిన ఒప్పందం ద్వారా తొలిసారి ఆంధ్రప్రదేశ్‌కు ఈ సంస్థ రావడం విశేషం. విశాఖ పట్నంలో త్వరలోనే ఇది ఏర్పాటు కానుంది.

ఏపీ తరపను లోకేష్ ఒప్పందం

ఏపీ తరపను లోకేష్ ఒప్పందం

అమెరికా పర్యటనలతో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆధ్వర్యంలో దిగ్గజ సంస్థ గూగుల్‌ ఎక్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఏపీ ఐటీ శాఖ అధికారులు, గూగుల్‌ ఎక్స్‌ సీఈఓ అస్టో టెల్లర్‌ మధ్య ఫ్రీ స్పేస్‌ ఆప్టికల్‌ కమ్యూనికేషన్‌కు సంబంధించి ఒప్పందం జరిగింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో గూగుల్‌ ఎక్స్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభించనున్నారు.

13జిల్లాల్లో డేటా, వైఫై సేవలు

13జిల్లాల్లో డేటా, వైఫై సేవలు

అధునాతన టెక్నాలజీలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా గూగుల్‌ ఎక్స్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటుకానుంది. ఫైబర్‌గ్రిడ్‌తో ఒప్పందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో 2వేల ఫ్రీ స్పేస్‌ ఆప్టికల్‌ కమ్యూనికేషన్‌ లింక్స్‌ను గూగుల్‌ ఎక్స్‌ ఏర్పాటు చేయనుంది. దీంతో ఫైబర్‌ కేబుల్‌ అవసరం లేకుండానే మొబైల్‌ డేటా, వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి.

అంత్యంత వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్..

దీంతో గ్రామీణ ప్రాంతాలకు కూడా అత్యంత వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ అందుబాటులోకి రానుంది. గూగుల్‌ ఎక్స్‌ రాకతో ఆంధ్రప్రదేశ్‌ కమ్యూనికేషన్‌లో విప్లవాత్మక మార్పులు రానున్నాయని లోకేశ్‌ అన్నారు.

సర్టిఫికెట్ లెస్ సేవలు

ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రజలకు అనేక సేవలు అందిస్తామని చెప్పారు. సర్టిఫికెట్ లెస్ గవర్నెస్ తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ తెలిపారు.

English summary
Google X will set up its Development Centre in Visakhapatnam. A memorandum of understanding (MoU) is signed between Government of Andhra Pradesh and Google X in San Francisco.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X