వివేకా హత్య: జగన్ కుట్ర; సీఎంగా రాజీనామా చెయ్: గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణలో వెలుగులోకి వస్తున్న అంశాలతో తెలుగుదేశం పార్టీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తోంది. వైయస్ వివేకానంద రెడ్డి హత్య వైయస్ కుటుంబ హత్యగా టిడిపి మండిపడుతోంది. ఇప్పటికే వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైయస్ జగన్ పాత్ర పై అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మాటల దాడిని మరింత పెంచింది. ఈ కేసులో జగన్ ను విచారించాలని డిమాండ్ చేస్తోంది.

Recommended Video

    YS Vivekananda Reddy కేసులో YS Jagan ని విచారించాలని TDP డిమాండ్| YSRCP | Oneindia Telugu
    జగన్ వివేకా హత్యకేసును తప్పుదోవ పట్టిస్తున్నారు

    జగన్ వివేకా హత్యకేసును తప్పుదోవ పట్టిస్తున్నారు

    తాజాగా టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీఎం జగన్ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణలు చేశారు. జగన్ ను అరెస్ట్ చేసి కేసు లోగుట్టును సిబిఐ వెలికితీయాలని ఆయన డిమాండ్ చేశారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులు ఏ విధంగా వ్యవహరించారో సాక్షుల వాంగ్మూలాలతో సీబీఐ విచారణలో బయటకు వస్తున్నాయని టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయం వ్యక్తం చేశారు.

    సిగ్గుంటే జగన్ ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోవాలి


    అసలు దోషి ఎవరో తేల్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్న ఆయన వివేకా హత్య కేసులో చంద్రబాబు పై తప్పుడు ప్రచారం చేస్తున్న జగన్, సిగ్గుంటే ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోవాలని డిమాండ్ చేశారు. అవినాష్ రెడ్డి, గంగిరెడ్డి లను కాపాడేందుకు సిబిఐ విచారణనే తప్పు పడుతున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డారు. జగన్ హత్య రాజకీయాల్లో ఆరితేరిన పోయారని న్యాయ వ్యవస్థను అస్తవ్యస్తం చేసేందుకు చూస్తున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. ఆరోజు గుండెపోటు అని చెప్పి సహజమరణం గా చిత్రీకరించి అంత్యక్రియలు చేసే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు.

    దోషులెవరో తేలుతుంటే జగన్ కు వెన్నులో వణుకు పుడుతుంది

    దోషులెవరో తేలుతుంటే జగన్ కు వెన్నులో వణుకు పుడుతుంది


    సిబిఐ విచారణలో దోషులెవరు తేలుతుంటే జగన్ కు వెన్నులో వణుకు పుడుతోందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. జగన్ సకుటుంబ సపరివార సమేతంగా చేసిన కుట్ర ఫలితమే వివేక హత్య అని ఆరోపించారు. వివేకా హత్య కేసును తప్పుదోవ పట్టించడంలో జగనే ప్రధాన దోషి అని ఆయన పేర్కొన్నారు. ఈ హత్య కేసులో సాక్షులను బెదిరిస్తున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. ఆర్థిక ఉగ్రవాది పాలనలో రాష్ట్ర పరిస్థితి అధ్వాన్నంగా మారిందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.

     సీబీఐ జగన్ ను విచారించాలి, జగన్ ను బోనులో నిలబెట్టాలి

    సీబీఐ జగన్ ను విచారించాలి, జగన్ ను బోనులో నిలబెట్టాలి

    జగన్ పాలనలో అంతులేని అరాచకాలు కొనసాగుతున్నాయి అంటూ మండిపడ్డారు. జగన్ హత్య రాజకీయాలపై అధికారులు భయపడిపోతున్నారు అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. వివేకా హత్య కేసుని సరిగా విచారణ జరపలేక పోయిన మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈరోజు దీనికి సమాధానం చెప్పాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. సీఎం జగన్ ను సీబీఐ విచారణ జరపాలని, జగన్ ను బోనులో నిలబెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యక్తుల పై చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+