• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాకిరెట్ట ఎంతో.. నీ ట్వీట్లు అంతే; సాయిరెడ్డికి పిచ్చి ముదిరిందన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి

|
Google Oneindia TeluguNews

ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేస్తున్న ట్వీట్లతో, తెలుగుదేశం పార్టీ నేతలు మూకుమ్మడిగా విజయసాయి రెడ్డి పై విరుచుకుపడుతున్నారు. విజయసాయి రెడ్డి చంద్రబాబు, లోకేష్ ను మాత్రమే కాకుండా అయ్యన్నపాత్రుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వంగలపూడి అనిత తదితరులను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆయన తన ఫ్రస్ట్రేషన్ ను సోషల్ మీడియా పోస్టులలో చూపిస్తున్నారు.

గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై విజయసాయి ఘాటు వ్యాఖ్యలు

తాజాగా విజయసాయిరెడ్డి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉద్దేశించి ఎల్లో లైట్ బ్రోకర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అశ్లీల బిట్లు చూసుకుంటూ అందరికీ ఫార్వార్డ్ చేసే ఎల్లో లైట్ బ్రోకర్ గాడివి అంటూ అసభ్యంగా దూషించారు. గంజాయి పాత్రుడు అన్నట్లుగానే మహిళల బట్టలు ఊడదీస్తే...ఆ బిట్లు కూడా ఫార్వార్డ్ చేసి క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నావేంట్రా బుచ్చిగా? అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

అంతేకాదు ఒరేయ్ బుచ్చీ అంటూ పరుష పదజాలంతో దూషించారు. ఎన్నిసార్లు గెలిచినా నువ్వు గజ్జి కుక్కవేరా బుచ్చిగా! ఎవడో ఉస్కో అంటే మొరగడం తప్ప సొంత వ్యక్తిత్వం లేనోడివి అంటూ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ చేరదీస్తే, వెన్నుపోటు పొడిచినోడి బూట్లు నాకుతున్నావు అంటూ బుచ్చయ్య చౌదరి విజయసాయిరెడ్డి టార్గెట్ చేశారు. బురదలో దొర్లే పంది కంటే హీనమైన బతుకురా బుచ్చి నీది అంటూ విజయసాయిరెడ్డి తిట్టిపోశారు.

పోరంబోకు కూడా నీలాంటి పోస్ట్ లు పెట్టరు.. సాయిరెడ్డికి ఘాటుగా గోరంట్ల జవాబు

ఇక విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. పిచ్చి ఆసుపత్రికి పంపించాల్సిన నిన్ను రాజ్యసభ కి పంపించారు అంటూ మండిపడ్డారు.వైజాగ్ నుండి మరో పిచ్చోడు తయారు అయ్యాడు అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి విరుచుకుపడ్డారు. అసలు ఇంట్లో మీ పిల్లలతో ఏమి బాష మాట్లాడుతారో తెలీదు కానీ..రాజ్యసభ సభ్యుడు కి గౌరవం మొత్తం పోగొట్టారు అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయసాయి రెడ్డి ని విమర్శించారు.రోడ్డు మీద తిరిగే పోరంబోకు కూడా నీలాంటి పోస్ట్ లు పెట్టరు అంటూ పోరంబోకు ల కంటే దారుణమైన వ్యక్తిగా విజయసాయిరెడ్డిని అభివర్ణించారు.

నీలాంటి వాడు రాజ్యసభ సభ్యుడిగా ఉండకూడదు

నీలాంటి వాడు రాజ్యసభ సభ్యుడిగా ఉండకూడదు

అంతేకాదు నీ లాంటి వాడు రాజ్య సభ సభ్యుడిగా ఉండకూడదు అని మండిపడ్డారు. ఒకవేళ అలా ఉంటే అది తెలుగు ప్రజలకు అవమానం, దౌర్భాగ్యం అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయసాయి రెడ్డిని ఉద్దేశించి పేర్కొన్నారు. ఆయానేమో విదేశం లో వైద్యం చేయించుకున్నారు..నువ్వు స్వదేశం లోవైజాగ్ లో వైద్యం చేయించుకుంటే పిచ్చి తగ్గుతుంది, అంటూ జగన్ మోహన్ రెడ్డిని, విజయసాయి రెడ్డి ని టార్గెట్ చేశారు. పొద్దున లేస్తే ఎవర్ని తిడదామా అని చూడడమే తప్ప ప్రజలకి మంచి చేసే ఉద్దేశము మాత్రం లేదు అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో విమర్శించారు.

సాయిరెడ్డికి పిచ్చి ముదిరిందన్న గోరంట్ల

సాయిరెడ్డికి పిచ్చి ముదిరిందన్న గోరంట్ల

ఇదే సమయంలో కాకి రెట్ట ఎంతో....వీసా ట్వీట్లు కూడా అంతే అంటూ విజయసాయి రెడ్డి పై విరుచుకుపడిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి 'పిచ్చి' సంగతి ఎలా ఉంది అంటే జనాలు జుట్టు పీక్కుంటున్నారు.. మీరు మాత్రం 'గెడ్డం' గికినట్లు వైజాగ్ ప్రజలని, కొండలని, మైన్ లని స్థలాలను సాంతం గీకేస్తున్నారు అని విరుచుకుపడ్డారు. మొత్తానికి విజయసాయి రెడ్డికి పిచ్చి ముదిరిందని, వైజాగ్ పిచ్చాసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించుకుంటే బాగుపడతారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.

English summary
Gorantla Butchaiah Choudary responded sharply to YSRCP MP Vijayasaireddy. your tweets are like crows shit, Gorantla Butchaiah Choudary was incensed that Saireddy was insane..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X