ఉషశ్రీ చరణ్ కు మంత్రిపదవి అందుకే.. జేసీ ప్రభాకర్ రెడ్డికి గోరంట్ల మాధవ్ చురకలు

అనంతపురంలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. మంత్రి ఉష శ్రీ చరణ్ తాడిపత్రి మునిసిపల్ చైర్ పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా అవకాశం దక్కించుకున్న ఉష శ్రీ చరణ్ పర్యటన నేపథ్యంలో ఓ చిన్నారి మరణించినట్టు ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. దీంతో తాడిపత్రి పర్యటనకు వచ్చిన మంత్రి ఉషశ్రీ చరణ్ జెసి ప్రభాకర్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు.

అనంతపురంలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ మంత్రి ఉషశ్రీ చరణ్

అనంతపురంలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ మంత్రి ఉషశ్రీ చరణ్

ఇక ఉషశ్రీ చేసిన వ్యాఖ్యలకు జేసీ ప్రభాకర్ రెడ్డి రివర్స్ కౌంటర్ ఇచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శవరాజకీయాలు చేస్తారని తాడిపత్రి కి వచ్చి తనపై విమర్శలు చేయడం కాదని ఈ నెల 15వ తేదీన చనిపోయిన పాప తండ్రి వికలాంగుడు అని, ఆయనకు వికలాంగుల పెన్షన్ ఇప్పించాలని, అలా చేస్తే మంత్రికి తానే స్వయంగా సన్మానం చేస్తానని పేర్కొన్నారు. మంత్రి ఉషశ్రీ కి అసలు మహిళా శిశు సంక్షేమ శాఖ గురించి ఏమాత్రం తెలియదని, అలాంటిది ఆమెకు మంత్రిగా అవకాశం ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఉషశ్రీ గతంలో ఏ పార్టీలో ఉన్నారో కూడా గుర్తు చేసుకోవాలని హితవు పలికారు.

జేసీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఎంపీ గోరంట్ల మాధవ్

జేసీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఎంపీ గోరంట్ల మాధవ్

ఇక మంత్రి ఉషశ్రీ కి, జేసీ ప్రభాకర్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం అవుతున్న సమయంలో హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తనదైన శైలిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కి కౌంటర్ ఇచ్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డి చదువు సంధ్య లేని వ్యక్తి అని ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యానించారు. మంత్రి ఉషశ్రీ కి మహిళా శిశు సంక్షేమ శాఖ గురించి తెలియదని మాట్లాడడం విడ్డూరంగా ఉందని గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు. మంత్రి ఉష శ్రీ చరణ్ కు ఉన్నత చదువులు చదివిన బీసీ మహిళ అని పేర్కొన్నారు గోరంట్ల మాధవ్.

తెలుగుదేశం పార్టీ ఒక చేవ చచ్చిన పార్టీ అన్న గోరంట్ల మాధవ్

తెలుగుదేశం పార్టీ ఒక చేవ చచ్చిన పార్టీ అన్న గోరంట్ల మాధవ్

ఆమె ఉన్నత చదువులు, ఆమె ఇంటిగ్రిటీ ని చూసే సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయనకు మంత్రి పదవి ఇచ్చారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక చేవ చచ్చిన పార్టీ అని, ఆ పార్టీని ప్రజలు దిబ్బలో పడేశారని గోరంట్ల మాధవ్ వ్యాఖ్యానించారు. ఉషశ్రీ చరణ్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి కి గోరంట్ల మాధవ్ రివర్స్ కౌంటర్ ఇవ్వడంతో గోరంట్ల మాధవ్ స్పందనపై జెసి ప్రభాకర్ రెడ్డి ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+