అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గోరంట్ల మాధవ్ పై ప్రధానికి ఎంపీ లేఖ - మహిళా కమిషన్ జోక్యం..!!

|
Google Oneindia TeluguNews

ఎంపీ గోరంట్ల మాధవ్ పైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆయన పైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ జస్బీర్‌ సింగ్‌ గిల్‌ విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. మాధవ్ కు సంబంధించింది అంటూ ఒక వీడియో వైరల్ అయింది. అయిదే, దీని పైన ఇప్పటికే అనంతపురం ఎస్పీ స్పష్టత ఇచ్చారు. అసలైన వీడియో బయటకు వస్తేనే దానిని ఫోరెన్సిక్ కు పంపగలుగుతామని చెప్పారు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో ఒక ఫోన్ నుంచి మరో ఫోన్ తో షూట్ చేసిందిగా నిర్దారించారు.

ఒర్జినల్ వీడియో కాదంటూ

ఒర్జినల్ వీడియో కాదంటూ

యూకే నుంచి దీనిని టీడీపికి చెందిన గ్రూపులో తొలుత పోస్టు చేసారని ఎస్పీ చెప్పుకొచ్చారు. ఇప్పుడు..కాంగ్రెస్‌ ఎంపీ జస్బీర్‌ సింగ్‌ గిల్‌ తన లేఖలో నైతికతను వదిలేసి వ్యవహరించిన తీరుతో షాక్ అయినట్లుగా పేర్కొన్నారు. పార్లమెంటు గౌరవానికి, ప్రతిష్ఠకు కళంకం తీసుకొచ్చారంటూ ఆరోపించారు. ఇది క్రిమినల్ చర్యగా ఆయన ప్రధానికి రాసిన లేఖలో వివరిస్తూ..చర్యలు తీసుకోవాలని కోరారు. మాధవ్ వ్యవహారం పైన తగిన చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మ లోక్ సభ స్పీకర్ కు లేఖ రాసారు.

ప్రధానికి కాంగ్రెస్ ఎంపీ ఫిర్యాదు

ప్రధానికి కాంగ్రెస్ ఎంపీ ఫిర్యాదు

వీడియో అసభ్యకరంగా, అశ్లీలంగా ఉందని తెలిపారు. వీడియో వ్యవహారంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మాధవ్‌ వీడియో ఘటనపై స్వతంత్ర దర్యాప్తు చేయించాలని కోరుతూ ఏపీ డీజీపీకి మరో లేఖ పంపారు. ఈ వీడియో పైన విచారణ చేయాలని తమకు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేసామని.. ఎవరైనా ఎంపీ పైన ఫిర్యాదు చేస్తే ఈ ఫిర్యాదు పైన విచారణ చేస్తామని పోలీసు అధికారులు స్పష్టం చేసారు. మాధవ్ వ్యవహారం రాజకీయంగా దుమారానికి కారణమైంది.

Recommended Video

ఏపీలో నాయీ బ్రహ్మణులను అలా పిలిస్తే చర్యలే *AndhraPradesh | Telugu OneIndia
స్పీకర్ కు మహిళా కమిషన్ లేఖ

స్పీకర్ కు మహిళా కమిషన్ లేఖ

దీని పైన ఎస్పీ ప్రకటన తరువాత ఎంపీ గోరంట్ల మాధవ్ టీడీపీ పైన విరుచుకు పడ్డారు.తాను తప్పు చేయలేదని..టీడీపీ నేతలు కావాలని తన పైన తప్పుడు ప్రచారం చేసారని చెప్పుకొచ్చారు.అయితే, ఎస్పీ ప్రకటనను ప్రతిపక్ష నేతలు తప్పు బడుతున్నారు. దీని పైన భిన్నంగా స్పందిస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ లేఖ రాయటం.. జాతీయ మహిళా కమిషన్ జోక్యం చేసుకోవటం తో ఇప్పుడు జాతీయ స్థాయిలో ఈ అంశం కొత్త మలుపు తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.

English summary
Congress MP Jaspir singh Kaur letter to PM Modi on YCP MP Gorantla Madhav video episode, Nation women commission letter to speaker.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X