స్థానిక సమరం:వైసిపి అభ్యర్థి గౌరు వెంకట్ రెడ్డి నామినేషన్, టిడిపికి చెక్ పెట్టేనా?
కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల వైఎస్ఆర్ సి పి అభ్యర్థిగా గౌరు వెంకట్ రెడ్డి సోమవారం నాడు నామినేషన్ ను దాఖలు చేశారు. పార్టీ నాయకులు, ఎంఏల్ఏలు వెంట రావడంతో వెంకట్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
కర్నూల్:స్థానిక సంస్థల ఎంఏల్ సి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార, విపక్ష పార్టీలు గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల ఎంఏల్ సి ఎన్నికల్లో వైఎస్ఆర్ సి పి అభ్యర్థిగా గౌరు వెంకట్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
కర్నూల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎంఏల్ సి ఎన్నికల్లో గౌరు వెంకటర్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా ప్రకటించింది. ఈ మేరకు వెంకట్ రెడ్డి తన నామినేషన్ సోమవారం నాడు దాఖలు చేశారు.
పార్టీ ఎంఏల్ ఏలు ఐజయ్య, గౌరు చరితారెడ్డి, బాలనాగిరెడ్డి,సాయి ప్రసాద్ రెడ్డి, పార్టీ నాయకులు గంగుల ప్రభాకర్ రెడ్డి, కాటసాని రాంరెడ్డి తదితరులు వెంకట్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కర్నూల్ జిల్లాలో స్థానిక సంస్థల్లో వైఎస్ ఆర్ సి పికి మెజారిటీ ఉంది.అయితే ఇటీవల కాలంలో వైఎస్ఆర్ సిపి కి చెందిన కొందరు ఎంఏల్ఏలు పార్టీని వీడి టిడిపిలో చేరారు.అయితే ఆ పార్టీ ఎంఏల్ ఏలు టిడిపిలో చేరడంతో వైఎస్ఆర్ సిపికి స్థానిక సంస్థలకు చెందిన ప్రజా ప్రతినిధులు సాంకేతికంగా మెజారిటీ కన్పించినా వారంతా వైసిపికి ఓటు చేస్తారా లేదా విషయాన్ని ఇప్పటికిప్పుడే చెప్పలేం.
నంద్యాల, ఆళ్ళగడ్డ ,కర్నూల్ ఎంఏల్ఏలు భూమా నాగిరెడ్డి, భూమా అఖిలప్రియ, ఎస్ వి మోహన్ రెడ్డిలు వైసిపిని వీడి టిడిపి లో చేరారు.దీంతో ఈ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టిడిపి, వైసిపి బలబలాల్లో తేడా కన్పిస్తోంది.నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల కోటా మండలి ఎన్నికలకు వైసిపి అభ్యర్థిగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి పేరును వైసిపి ఖరారు చేసింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications